Home /News /telangana /

RAJANNA SIRCILLA SRI RAJARAJESHWARA SWAMY TEMPLE IN VEMULAWADA IS READY FOR SRAVANA MASA SPECIAL PUJAS ABH BRV RKH

Rajanna Sircilla: శ్రావణమాసం విశేష పూజలకు ముస్తాబైన రాజన్న ఆలయం!..

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం

శైవ, వైష్ణవ సాంప్రదాయాల మేళవింపు, భక్తి నియమాలకు మారుపేరుగా నిలచిన ఆలయంలో నెల రోజులపాటు శ్రావణమాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ మాసంలో.. వచ్చే ఐదు శుక్రవారాలు, నాలుగు సోమవారాల్లో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరుగుతాయి

    (K.Haribabu, News 18, Rajanna Sircila)

    శ్రావణమాసం వచ్చిందంటే చాలు ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోతారు భక్తులు. దక్షిణ కాశీగా, ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాసాంతం ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. శైవ, వైష్ణవ సాంప్రదాయాల మేళవింపు, భక్తి నియమాలకు మారుపేరుగా నిలచిన ఆలయంలో నెల రోజులపాటు శ్రావణమాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ మాసంలో.. వచ్చే ఐదు శుక్రవారాలు, నాలుగు సోమవారాల్లో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరుగుతాయి. శ్రావణ శుక్రవారాలలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఉదయం, సాయంత్రం వేళలో చతుష్షష్టి ఉపచారాలతో విశేష పూజలు జరుగుతాయి. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి షోడశోపాచార పూజలను అర్చక స్వాములు నిర్వహిస్తారు. శ్రావణ సోమవారాలలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఉదయం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని, సాయంత్రం 6:30 గంటలకు కళ్యాణ మండపంలో మహా లింగార్చనను అర్చక స్వాములు నిర్వహిస్తారు.

    19 కృష్ణాష్టమి: కృష్ణాష్టమి సందర్భంగా వైష్ణవ ఆలయాలలో పంచోపనిషత్ ద్వారాభిషేకం, అర్చనలు స్వామివార్లకు నిర్వహిస్తారు. రాత్రి కల్యాణ మండపంలో ఉట్లుకొట్టుట, డోలోత్సవాన్ని వేద పండితులు నిర్వహిస్తారు. అంతేకాకుండా శ్రీ భీమేశ్వర ఆలయంలో రాత్రి మహా పూజ కార్యక్రమం జరుగుతుంది.

    శ్రావణమాసం ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారని, కావునా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వేములవాడ రాజన్న ఆలయ ఈఓ రమాదేవి పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్ధం క్యూలైన్లలో శానిటేషన్, తాగేందుకు మంచి నీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.



    శ్రావణమాసం ప్రారంభమైన నేపథ్యంలో ఆలయంలో నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం శ్రావణమాసం స్వామి వారికి ఇష్టమైన రోజు కావడంతో స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని అన్నారు. బుధ, శుక్ర శనివారం రోజుల్లో శ్రీ పార్వతి రాజరాజేశ్వరి అమ్మవార్లకు కుంకుమార్చన పూజలు నిర్వహిస్తే ఆయురారోగ్యాలు సిరిసంపదలు వర్ధిల్లుతాయని అర్చకులు అంటున్నారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో దేవదేవులను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పరివార దేవతలతో పాటు అనుబంధ దేవాలయాల్లో సైతం విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అర్చక స్వాములు వేద పండితులు తెలిపారు.

    టెంపుల్: ఈవో +91 94910 00743 number

    08723-236018 ఆఫీస్
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు