హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Sircilla: రాజన్న భక్తులకు శుభవార్త.. ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజలు

Rajanna Sircilla: రాజన్న భక్తులకు శుభవార్త.. ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజలు

వేములవాడ రాజన్న ఆలయంలో దసరాఉత్సవాలకు సర్వం సిద్ధం

వేములవాడ రాజన్న ఆలయంలో దసరాఉత్సవాలకు సర్వం సిద్ధం

తెలంగాణ (Telangana) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, పేదల పెన్నిధిగా, కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్య క్షేత్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  K. Haribabu, News18, Rajanna Sircilla

  తెలంగాణ (Telangana) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, పేదల పెన్నిధిగా, కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్య క్షేత్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. విజయదశమి (Vijayadashami) పర్వదినం సందర్భంగా నిర్వహించే శ్రీదేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వహించనున్న ప్రత్యేక పూజలతో కూడిన షెడ్యూల్‌ను ఆలయ ఉన్నతాధికారులు విడుదల చేశారు. సెప్టెంబర్ 26వ తేదీ సోమవారం ప్రారంభమయ్యే ఉత్సవాలలో భాగంగా తొలిరోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. రెండో రోజు 27వ తేదీ మంగళవారం బ్రహ్మచారిణి అలంకారంలో, మూడో రోజు 28వ తేదీ బుధవారం చంద్ర ఘంట అలంకారంలో, 4వ రోజు 29వ తేదీ గురువారం కూష్మాండ అలంకారంలో, 5వరోజు 30వ తేదీ శుక్రవారం స్కందమాత అలంకారంలో, 6వ రోజు అక్టోబర్ 1వ తేదీ శనివారం కాత్యాయని అలంకారంలో, ఏడవ రోజు 2 వతేదీ ఆదివారం కాళరాత్రి అలంకారంలో, 8వ రోజు 3వ తేదీ సోమవారం మహాగౌరీ, 9వ తేదీ మంగళవారం సిద్ధిద్దా అలంకారంలో పదో రోజు 5వ తేదీ బుధవారం మహాలక్ష్మి అలంకారంలో ఆమ్మవారు దర్శనమిస్తారు.

  అక్టోబరు 2వ తేదీ ఆదివారం మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం 9:30 గంటలకు పుస్తక రూపిణి మహా సరస్వతి పూజ, 3వ తేదీ సోమవారం దుర్గాష్టమి సందర్భంగా చండీవహనం, రాత్రి మహిషాసుర మర్దిని అమ్మమవారికి మహాపూజ, 4వ తేదీ మంగళవారం మహార్నవమి సందర్భంగా స్వామి వారి ధర్మగుండంలో తెప్పోత్సవం, 5వ తేదీ బుధవారం దసరా పండుగ సందర్భంగా ఆయుధపూజ, అంబారి వాహనంపై స్వామి వారి పెద్ద సేవ, శమీయాత్ర నిర్వహిస్తారు. శ్రీదేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పది రోజులపాటు స్వామివారి నిత్యకల్యాణం రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆలయ ఉన్నత అధికారులు విజ్ఞప్తి చేశారు.

  ఇది చదవండి: కాలాపానిని తలపించే నిజాం కాలం నాటి జైలు.., మన తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

  ప్రతి సంవత్సరం రాజన్న ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల నేపథ్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవరాత్రులు అమ్మవారిని నిష్టతో పూజిస్తే కోరిన కోరికలు తీరి సిరిసంపదలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముత్తైదువులు, ఆడపడుచులు అమ్మవారిని పూజిస్తే సౌభాగ్యం కలకాలం ఉంటుందని మహిళా భక్తుల నమ్మకం. అమ్మవారు నవరాత్రులు నవ దుర్గా రూపంలో భక్తులకు దర్శనమివ్వన్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు రంగురంగుల ఎల్ఈడి లైట్స్ తో, ప్రత్యేక పుష్పాలతో ఆలయాన్ని ముస్తాబు చేయనున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Siricilla, Telangana, Vemulawada

  ఉత్తమ కథలు