హోమ్ /వార్తలు /తెలంగాణ /

రాజన్న సన్నిధానంలో ఉగాది పర్వదినం సందర్భంగా విశేష పూజలు!

రాజన్న సన్నిధానంలో ఉగాది పర్వదినం సందర్భంగా విశేష పూజలు!

X
రాజన్నసన్నిధిలో

రాజన్నసన్నిధిలో వేడుకలు

Telangana: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉగాది పచ్చడి భక్తులకు పంపిణీ చేశారు. సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు. కాగా, నేటి నుంచి 9 రోజులపాటు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలతో, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.

ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం 8 గంటలకు స్వస్తి పుణ్యహవచనము, ఋత్విక్వరణము, స్వామివారితో పాటు అనుబంధ దేవతలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 10.40 గంటలకు పంచాంగ పూజ, సాయంత్రం 4.00 గంటలకు పంచాంగ శ్రవణము, పండిత సన్మానం, రాత్రి స్వామివార్లు పెద్ద సేవపై ఊరేగనున్నారు. నేటి నుంచి అనగా 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు శ్రీరామనవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పార్వతీ రాజరాజేశ్వరస్వామి, సీతారామచంద్రస్వామివార్లకు ప్రత్యేక పూజలు చేస్తామని అర్చకులు గోపన్న గారి శివ వెల్లడించారు. ఈనెల 28వ తేదీ నుంచి 3 రోజులపాటు భక్తోత్సవం నిర్వహిస్తారు. 30వ తేదీ గురువారం శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం 11:59 గంటలకు సీతారామచంద్ర స్వామివార్ల దివ్య కల్యాణోత్సవం ఉంటుంది. పూర్ణాహుతి అనంతరం సాయంత్రం స్వామివార్ల థోత్సవం, రాత్రి డోలోత్సవం నిర్వహిస్తారని ఆలయ ఉన్నత అధికారులు, అర్చకులు తెలిపారు.

ఉగాది పర్వదినం నేపథ్యంలో ఉదయం పట్టణంలోని భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకుని మూలవిరాట్ కు అభిషేకాలు నిర్వహించి పరివార దేవతలను దర్శించుకున్నారు. ఉదయం భక్తులు స్వామివారిని దర్శించుకుని సేవలో తరించారు. స్వామివారి దర్శనానంతరం పచ్చడిని స్వీకరించారు. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు ఉంటాయని అర్చకులు వెల్లడించారు.

అద్దాల మండపంలోని శ్రీలక్ష్మి అనంత పద్మనాభస్వామి, శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివార్లకు అర్చకులు వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయాల్లో సైతం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించామని అర్చకులు, వేద పండితులు పేర్కొన్నారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో ప్రతిఏటా శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈసారి కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో శ్రీరామ నవరాత్రోత్సవాలు జరిగే విధంగా దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

First published:

Tags: Local News, Rajanna sircilla, Telangana, Ugadi 2023

ఉత్తమ కథలు