హోమ్ /వార్తలు /తెలంగాణ /

కలెక్టరేట్ ఉద్యోగినుల పిల్లల కోసం క్రీచ్.. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం!

కలెక్టరేట్ ఉద్యోగినుల పిల్లల కోసం క్రీచ్.. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం!

X
రాజన్న

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla District) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 6 నెలల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లల సంరక్షణ చూసేందుకు వీలుగా మంత్రి కేటీఆర్ (Minister KTR) మార్గదర్శనం మేరకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధునాతన హంగులతో శిశువులను జాగ్రత్తగా చూసే స్థలాన్ని(క్రీచ్) ఏర్పాటు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

Haribabu, News18, Rajanna Sircilla

రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla District) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 6 నెలల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లల సంరక్షణ చూసేందుకు వీలుగా మంత్రి కేటీఆర్ (Minister KTR) మార్గదర్శనం మేరకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధునాతన హంగులతో శిశువులను జాగ్రత్తగా చూసే స్థలాన్ని(క్రీచ్) ఏర్పాటు చేశారు. కాగా ఈ క్రీచ్ ను మంత్రి కేటీఆర్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ లు సోమవారం ప్రారంభించారు. సిబ్బంది, చిన్నారులను మంత్రి పలకరించారు. చిన్నారులను స్వయంగా నీ పేరేంటి అంటూ అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల కోసం చాక్లెట్స్ ఉన్నాయా!..లేవా.. అంటూ అధికారులను మంత్రి కేటీఆర్ అడిగారు.

క్రీచ్ లో తాగు నీటి సదుపాయం, చల్లని నీరు, వేడి నీరు, వంట సామాగ్రి, టాయిలెట్, ఆట వస్తువులు, నిద్రపోవడానికి కావలసిన ఏర్పాట్లు, వస్తువులు, భోజనాన్ని నిలువ చేసుకోవడానికి కావలసిన వస్తువులు, ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి అవసరమైనటువంటి పజిల్స్, ఆట వస్తువులు, అట బొమ్మలు, స్మార్ట్ టీవీ, అవుట్ డోర్ ఆట వస్తువులు, విశ్రాంతి తీసుకోవడానికి ఊయలలు, పడుకోవడానికి అవసరమైన వస్తువులు, అలాగే బాలింతలు పాలివ్వడానికి బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. IDOCలో పని చేసే మహిళా ఉద్యోగినుల పిల్లల సంరక్షణ కోసం ఉద్దేశించిన క్రీచ్ చిన్నారులు ఉన్న మహిళ ఉద్యోగినులు ఎంతగానో ఉపయోగకారంగా ఉండనుంది. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజ్యం దీని నిర్వహణ బాధ్యతలు చూడనున్నారు.

ఇది చదవండి: పల్లెప్రగతి కార్యక్రమం దేశానికే దిక్సూచీ

క్రీచ్ ను పరిశీలించిన మంత్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని అభినందించారు. ఉద్యోగాలు చేసే మహిళలకు క్రీచ్ ఎంతో ప్రయోజనకరంగా ఉండనుందని మంత్రి అన్నారు. క్రీచ్ స్థలం చాలా బాగుందని మంత్రి కేటీఆర్ అన్నారు. చిన్నారుల సంరక్షణ స్థలం, అందులో చిన్న పిల్లలకు ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, రంగు రంగుల డ్రాయింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయనే చెప్పాలి. బాగుంది అంటూ మంత్రి కేటీఆర్ సైతం కలెక్టర్ ను అభినందించారు. అన్ని విధాలుగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ అభివృద్ధి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల డిపో నుండి రెండు సూపర్ లగ్జరీ బస్సులు కాకినాడకు, రెండు డీలక్స్ బస్సులు వరంగల్ కు మొత్తం 4 కొత్త TSRTC బస్సులను మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరెట్ లో ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికి తెలంగాణ రాష్ట్రం మోడల్ గా మారుతుందన్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలు తప్ప చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు.

First published:

Tags: KTR, Local News, Siricilla, Telangana