హోమ్ /వార్తలు /తెలంగాణ /

తీరు మార్చుకోకపోతే తాట తీస్తా.. రౌడీ షీటర్లకు ఎస్పీ వార్నింగ్

తీరు మార్చుకోకపోతే తాట తీస్తా.. రౌడీ షీటర్లకు ఎస్పీ వార్నింగ్

జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ, పోలీసు అధికారులతో ఎస్పీ సమావేశం

జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ, పోలీసు అధికారులతో ఎస్పీ సమావేశం

రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే (IPS) జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, సబ్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి జిల్లాలో ఉన్న రౌడీ షీట్లర్ల కదలికలపై ఆరా తీశారు.

  (K. Haribabu, News 18, Rajanna Sircilla)

  రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా పరిధిలో ఉన్న రౌడీ షీటర్లలపై (Rowdy sheeters) ప్రత్యేక నిఘా ఉంటుందని.. ఎవరు ఏ పనిచేస్తున్నా తమ నజర్ తప్పక ఉంటుందని ఎస్పీ రాహుల్ హెగ్డే (SP Rahul Hegde) అన్నారు. జిల్లా పరిధిలో రౌడీ షీట్ ఉన్న వారు సత్ప్రవర్తన కలిగి ఉంటే వారిపై రౌడీ షీట్ తొలగించడానికి ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. రౌడీషీట్స్ ఉన్నవారిపై ఎల్లవేళలా పోలీస్ నిఘా, పర్యవేక్షణ ఉంటుందని, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించినా, అక్రమ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

  జీవితాలను సరిదిద్దుకోవాలి..

  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే (IPS) జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, సబ్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి జిల్లాలో ఉన్న రౌడీ షీట్లర్ల కదలికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న రౌడి షీటర్ల జాబితాను పరిశీలించిన ఎస్పీ రాహుల్ హెగ్డే, వారి కదలికల గురించి అడిగి తెలుసుకున్నారు.

  ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియాతో మాట్లాడుతూ.. రౌడీషీట్స్ ఉన్న వారిపై ఎల్లవేళలా పోలీస్ నిఘా ఉంటుందని, వారు చేసే ప్రతిపనిని పర్యవేక్షించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా కొన్ని రోజులుగా నేరాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో నడుచుకుంటున్న రౌడీ షీటర్లను గుర్తించి వారి జాబితాను తయారు చేయాలని.. వారిపై ఉన్న రౌడి షీట్ తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.

  పాత నేరస్తులు సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. రౌడీషీటర్ల ప్రవర్తనలో ఎటువంటి మార్పులు లేకుండా తరచు నేరాలకు పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్టు కూడా నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. జిల్లా ప్రజలు అత్యవసర సమయాల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Rajanna, Rowdyism, Siricilla

  ఉత్తమ కథలు