హోమ్ /వార్తలు /తెలంగాణ /

పుచ్చకాయపై మాతృమూర్తి చిత్రం.. అమ్మపై ప్రేమను చాటుకున్న టీచర్!

పుచ్చకాయపై మాతృమూర్తి చిత్రం.. అమ్మపై ప్రేమను చాటుకున్న టీచర్!

X
జగిత్యాలలో

జగిత్యాలలో పుచ్చకాయపై తల్లిబొమ్మ చెక్కిన కుమారుడు

చోలేశ్వర్ చారి గతంలో సైతం పుచ్చకాయపై స్వతంత్ర సమరయోధుల ప్రతిమలను గీసి అందరిని అబ్బురపరిచారు. విద్యార్థులు ఆర్ట్ శిక్షణ తరగతులకు ఆసక్తిగా హాజరవుతున్నట్లు తెలిపిన ఆయన.. మాతృమూర్తి ప్రతిమను పుచ్చకాయపై గీయడానికి ప్రత్యేకమైన కారణం ఉందని చెప్పారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

Haribabu, News18, Rajanna Sircilla

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) పురస్కరించుకొని పుచ్చకాయపై మాతృమూర్తి చిత్రం గీశాడో కళాకారుడు. జగిత్యాల జిల్లా (Jagityal District) గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, కవి గాలిపెల్లి చోలేశ్వర్ చారి పుచ్చకాయ మీద తల్లి, బిడ్డ రూపాన్ని చెక్కారు. ఇలా చెక్కిన రూపాన్ని తన తల్లికి, ఎందరో తల్లులకు, స్త్రీ మూర్తులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. చోలేశ్వర్ చారితో పాటు పాఠశాల విద్యార్థులు యండి. సోహెల్, ఏ.శ్రావణ్ లు సైతం ఆర్ట్ లో పాల్గొని మెళుకువలు నేర్చుకున్నారు. విద్యార్థులకు ఇలా నేర్పడంలో ఎంతో తృప్తి ఉంటుందని చోలేశ్వర్ చారి పేర్కొన్నారు. చోలేశ్వర్ చారి ప్రస్తుతం వేములవాడ తెలంగాణ మైనారిటీ గురుకులంలో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తున్నారు. పుచ్చకాయ మీద తల్లి, బిడ్డ ప్రతిమను చూసిన ప్రిన్సిపాల్ కె..కుమారస్వామి, సహోపద్యాయులు సైతం అభినందించారు.

చోలేశ్వర్ చారి గతంలో సైతం పుచ్చకాయపై స్వతంత్ర సమరయోధుల ప్రతిమలను గీసి అందరిని అబ్బురపరిచారు. విద్యార్థులు ఆర్ట్ శిక్షణ తరగతులకు ఆసక్తిగా హాజరవుతున్నట్లు తెలిపిన ఆయన.. మాతృమూర్తి ప్రతిమను పుచ్చకాయపై గీయడానికి ప్రత్యేకమైన కారణం ఉందని చెప్పారు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని పెద్దలు అనేక సందర్భంలో చెబుతున్న విషయం మనకు తెలిసిందే. అందుకే అమ్మను ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమ్మ తన బిడ్డకు అమ్మ జన్మనిస్తోంది. అందుకే అమ్మకు అంత విలువ. అమ్మ తన బిడ్డలకు ఎటువంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అమ్మ తను కడుపు మాడ్చుకొని తన కన్నబిడ్డల కడుపు నింపుతుంది. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.

ఇది చదవండి: గిరిజన నృత్యాలు చూడాలంటే ఈ జాతరకు వెళ్లాల్సిందే..!

మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ.. వాటిని సెలబ్రేట్ చేయడానికి మహిళల విజయాలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారనీ మనందరికీ తెలుసు.. అందుకే ఈ రోజునే అమ్మ రూపాన్ని చెక్కి తన భావాన్ని చాటుకున్నట్లు చోళేశ్వర్ చారి తెలిపారు. మానవాళి పుట్టుకకు శ్రీ మూర్తి మూలాధారమని, అమ్మను గౌరవిస్తూ పూజించడమే మన కర్తవ్యం అని పేర్కొన్న చోళేశ్వర్.. మహిళలందరికీ అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

First published:

Tags: Jagityal, Local News, Siricilla, Telangana