హోమ్ /వార్తలు /తెలంగాణ /

రాజన్న పుణ్యక్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం!..

రాజన్న పుణ్యక్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం!..

X
వేములవాడ

వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం 

Telangana: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(K.Haribabu,News18, Rajanna siricilla)

దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో శివపార్వతులు శివసత్తులు, భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నేపథ్యంలో హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివార్ల దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు.

స్వామి వారి దివ్య కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమా శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చక స్వాములు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణ తంతును తిలకించి భక్తులు తన్మయత్వాన్ని పొందారు. సీతారాముల కళ్యాణం అనంతరం జోగినిలు, శివసత్తులు తలంబ్రాలను ఒకరిపై ఒకరు పోసుకుంటూ శివున్ని పెళ్లాడినట్లు మనసులో స్మరించుకుంటూ.. తన్మయత్వాన్ని పొందారు.

ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో దివ్య కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ చూసేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. కళ్యాణ నేపథ్యంలో భక్తులు ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది పర్యవేక్షించారు. భక్తుల ఆకలి దప్పికలు తీర్చేందుకు ఆలయ అధికారులు అన్నదానంతోపాటు వాటర్ ప్యాకెట్స్ అందజేశారు.

తొమ్మిది రోజుల పాటు వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల్లో పరివార దేవతలను అభిషేక పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా అర్చక స్వాములు, వేద పండితులు నిర్వహించారు. సాయంత్రం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి, సీతారామ చంద్రులు రథోత్సవంపై వేములవాడ పట్టణ పురవీధుల గుండా విహరించనున్నారు. స్వామి వారి దివ్య కళ్యాణాన్ని తిలకిస్తే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శివసత్తులు శివపార్వతులు శ్రీరామనవమి నేపథ్యంలో శివ కళ్యాణం తర్వాత రోజు రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాల నైవేద్యాలు డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా సమర్పించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని వారు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వేములవాడ రాజన్న సన్నిధానంలో జరిగే సీతారాముల కల్యాణానికి తప్పక వస్తావని, సీతారాముల కళ్యాణం ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారని పేర్కొన్నారు.

First published:

Tags: Local News, Rajanna sircilla, Srirama navami, Telangana

ఉత్తమ కథలు