హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఇది రైతు బజార్ అంటే నమ్ముతారా.. వైన్ షాప్ కంటే దారుణం

ఇది రైతు బజార్ అంటే నమ్ముతారా.. వైన్ షాప్ కంటే దారుణం

X
rythu

rythu bajar

రైతు బజార్ అంటే.. సామాన్యులకు తక్కువ ధరలకు కూరగాయలు అందించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే మార్కెట్. అక్కడ కూరగాయలే ఉండాలి గానీ.. అధికారుల నిర్లక్ష్యంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే చెబుతున్నాయి అక్కడి దృశ్యాలు.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar | Telangana

Haribabu, News18, Rajanna Sircilla

రైతు బజార్ అంటే.. సామాన్యులకు తక్కువ ధరలకు కూరగాయలు అందించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే మార్కెట్. అక్కడ కూరగాయలే ఉండాలి గానీ.. అధికారుల నిర్లక్ష్యంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే చెబుతున్నాయి అక్కడి దృశ్యాలు. సాయంత్రం, రాత్రి సమయాలలో మందుబాబులు తిష్టవేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రజా అవసరాలకు సంబంధించి నిధుల మంజూరులో క్షణం కూడా ఆలోచించ కుండా నిధుల విడుదల చేస్తుంటే, స్థానిక అధికారులు మాత్రం నిర్లక్ష్యంతో అవన్నీ పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరు అన్న చందంగా మారుతున్నారనే చెప్పాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద రైతులు తాము పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు వీలు కల్పిస్తూ.. కోట్లాది రూపాయలు వెచ్చించి సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో రైతు బజార్ (Raithu Bazer)నిర్మించారు మంత్రి కేటీఆర్. ఇందులో ఒకవైపు కూరగాయలు విక్రయించడానికి స్టాల్స్ ఏర్పాటు చేయగా, మరోవైపు (గొర్రె,మేక,కోడి,చేపల) సంబంధించిన మాంసం అమ్మడానికి స్టాల్స్ నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కూరగాయల మార్కెట్లో రైతులు తాజా కూరగాయలను తక్కువ ధరకే అందిస్తుండడంతో ప్రజలు వాటికోసం మార్కెట్ కు వస్తున్నారు.

కాగా మాంస విక్రయదారులు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఇక్కడ విక్రయాలు కొనసాగించడంతో స్టాల్స్ నిరుపయోగంగా మారి దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ స్టాల్స్ అన్ని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. స్టాల్స్ లో తాగుబోతులు మద్యాన్ని సేవించి, ఆ సీసాలను అక్కడే పగలగొట్టి వెళ్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సగం స్టాల్స్ లలో మద్యం సీసాలు, పగిలిన వాటి ముక్కలు దర్శనమిస్తున్నాయి. స్టాల్స్ లలో మాంసం కడగడానికి నళ్ళాలు, సింక్ లు ఏర్పాటు చేశారు. ఈ సింక్ లలో కూడా ఖాళీ మద్యం సీసాలే కనిపిస్తున్నాయి. ఆకతాయిలు కొన్ని నళ్ళాలను ధ్వసం చేశారు.

ఇది చదవండి: పంట పొలాలకు నీటిని పారించేందుకు రైతులు కొత్త తరహా పద్ధతులు

విక్రయశాలలో నీరు నాచు పట్టి ఉండడం చూస్తుంటే, ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు చాలా రోజులుగా కన్నెత్తి చూడలేదని ఆ దృశ్యాలు అనుకోవచ్చు అని చెబుతున్నాయి. కొన్ని స్టాల్స్ లో మలవిసర్జన చేసి కూడా వెళ్తున్నారంటే అధికారుల పర్యవేక్షణ ఎంత కోరవడిందో తెలుస్తుంది. ప్రభుత్వ నిషేధిత గుట్కా కవర్లు కూడా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయంటే, అధికారుల నిర్వహణ తీరు ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రైతు బజార్ యొక్క ప్రధాన ద్వారం పక్కనే తాగి పడేసిన మద్యం సీసాల దర్శనం ఇస్తున్నాయంటే, అధికారుల ఏ స్థాయి మత్తులో ఉన్నారో మీరే ఊహించుకోండి.

కనీసం శుభ్రపరచడానికి మున్సిపల్ సిబ్బందిని కూడా పంపకపోవడం గమనార్హం. స్వచ్ఛ సర్వేక్షన్ అంటూ అవార్డులు పొందుతున్న పట్టణంలో ఇంత అధ్వాన్నం ఏంటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్వాకంతో మంత్రి కేటీఆర్ ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం వెచ్చించిన కోట్లాది రూపాయలు కూడా ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి, ఇప్పటికైనా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

First published:

Tags: Local News, Siricilla, Telangana

ఉత్తమ కథలు