హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఈ మున్సిపాలిటీలో ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ..! పట్టించుకునే నాథుడేడి..?

ఈ మున్సిపాలిటీలో ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ..! పట్టించుకునే నాథుడేడి..?

లోటుబడ్జెట్ లో సిరిసిల్ల మున్సిపాలిటీ

లోటుబడ్జెట్ లో సిరిసిల్ల మున్సిపాలిటీ

సిరిసిల్ల మున్సిపాలిటి (Siricilla Municipality) లో ప్రతి నెల వచ్చే ఆదాయం తక్కువ..పోయే ఖర్చులు మాత్రం చాలా ఎక్కువ. ఇలా.. ఏడాదికి రూ.6 కోట్ల లోటు బడ్జెట్ తో సిరిసిల్ల మున్సిపల్ నిర్వహణ రోజు రోజుకు ఇబ్బందుల్లో పడిపోతొందనే చెప్పాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar | Telangana

Haribabu, News18, Rajanna Sircilla

సిరిసిల్ల మున్సిపాలిటి (Siricilla Municipality) లో ప్రతి నెల వచ్చే ఆదాయం తక్కువ..పోయే ఖర్చులు మాత్రం చాలా ఎక్కువ. ఇలా.. ఏడాదికి రూ.6 కోట్ల లోటు బడ్జెట్ తో సిరిసిల్ల మున్సిపల్ నిర్వహణ రోజు రోజుకు ఇబ్బందుల్లో పడిపోతొందనే చెప్పాలి. మున్సిపల్లో ఆర్థిక భారం పడి రూ.కోట్లలో బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయి. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.10 కోట్ల బకాయిలకు రోజూ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగిపోతున్నారు. కొత్తగా జరిగే అత్యవసర అభివృద్ధి పనులకు అధికారులు టెండర్లు నిర్వహించిన పనులు చేయడానికి కాంట్రాక్టర్లు జంకుతున్నారంటే అర్థం చేసుకోవాలి. దీంతో అధికారులు ఎలాగో అలా బతిమిలాడి.. సాధ్యమైనంత త్వరగా బిల్లులు ఇప్పిస్తామంటూ కార్మిక వాడల్లో అత్యవసర పనులను చేయిస్తున్నారు.

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో అడ్డగోలు వ్యవహారాలు, అవనసర ఖర్చులు తగ్గించుకోవడానికి మున్సిపల్ అధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో వివిధ పన్నుల ద్వారా రూ.80 లక్షలలోపే ఆదాయం ఉండగా ప్రతి నెలా మున్సిపల్ సిబ్బంది జీత భత్యాలు, నిర్వహణ వ్యయం రూ.1.35 కోట్ల పైనే ఉంటుంది.

ఇది చదవండి: ఫ్రెండ్లీ పోలీసింగ్ ‌లో ఇదొక పార్ట్.. భద్రాద్రి పోలీసుల కొత్త ఐడియా..!

సంవత్సరానికి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఇంటి పన్నుల ద్వారా రూ.4.30 కోట్లు,ఇంటి నిర్మాణ ఫీజుల ద్వారా రూ.4కోట్లు,నల్లా పన్నుల ద్వారా రూ.1.30 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారిక లెక్కలు.ఇలా సూమారుగా రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్లలోపే ఆదాయం రాగా.. జీత భత్యాలు, నిర్వహణ, డీజిల్ ,విద్యుత్ బిల్లులు, ఇతర మౌళిక వసతుల కల్పనకు ఖర్చు రూ.16 కోట్ల ఖర్చవుతుందని తెలుస్తోంది. అత్యధికంగా నెలకు డీజిల్ బిల్లులు రూ.10 లక్షలు, విద్యుత్ బిల్లు రూ.15 లక్షలకు పైగా, జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, కలెక్టరేట్ నిర్వహణకు ఏడాదికి రూ.1.50 కోట్ల అదనంగా భారం పడుతుంది.

ఇది చదవండి: డ్యుయల్ టాలెంట్ అంటే వీళ్లదే..! ఆడుతూ ఆడిస్తారు.. శభాష్ అనాల్సిందే..!

సిరిసిల్ల మున్సిపల్ కి. సిరిసిల్ల మున్సిపల్ ఆర్థిక కష్టాలోకూరుకుపోవడంతో 3 సంవత్సరాలుగా విద్యుత్ బకాయిలు రూ.1.20 కోట్లు పేరుకుపోయాయి. దీంతో నెల రోజుల క్రితం సిరిసిల్ల సెస్ అధికారులు మున్సిపల్ శాఖకు నోటీసులు జారీ చేసి బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కాంట్రాక్టర్లు చేసిన వివిధ అభివృద్ధి పనులు చేసి సంవత్సరాలు గడుస్తున్న (దాటుతున్న) బిల్లులు చెల్లించడం లేదు. ఈ బిల్లులే రూ.10 కోట్లకు పైగా ఉన్నాయి. అప్పులు తెచ్చి పనులు చేసిన చిన్న చితక తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. కాంట్రాక్టర్లు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ...అప్పుల ఉభిలో కూరుకుపోతున్నారు.

ఇది చదవండి: ఒడిత సాయంతో రాయి పెట్టి కొడితే కోతులు పరార్.. అసలు ఒడిత అంటే తెలుసా..?

ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తామని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఖర్చులు తగ్గించుకోవడానికిప్రయత్నం చేస్తూనే.. ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తామని, లోటు బడ్జెట్ నుంచి ఎలా బయటపడుతామనేది పాలకవర్గం సభ్యులు, అధికారులతో చర్చించి.. మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంలో ముందుకు వెళ్తామన్నారు. ఏమైనా నిధులు అవసరం ఉంటే మంత్రి కేటీఆర్ తో మాట్లాడుతామని, ఇప్పటికే స్పెషల్ ఫండ్ చాలా ఇచ్చారని గుర్తు చేశారు. ఇంకా ఏమైనా అవసరం ఉంటే మంత్రి దృష్టికి తీసుకెళ్తామని, బిల్లుల బకాయిలు దశల వారీగా చెల్లిస్తామని పేర్కొన్నారు.

ఇది చదవండి: ఏజెన్సీలో లంపిస్కిన్ వ్యాధి కలవరం.. పశువైద్యుల సూచనలు ఇవే..!

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మున్సిపల్ అధికారులు,పాలకవర్గం అనవసరపు ఖర్చులు తగ్గించుకోకపోవ కాకుండా.. అదనపు ఆదాయంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నూరుశాతం పన్నులు వసూలు చేసిన ఏడాదికి రూ.6 కోట్ల లోటు బడ్జెట్ ఉంటుందంటే.. భవిష్యత్ కాలంలో మున్సిపల్ నిర్వహణ భారం ఎలా ఉండనుందో అర్థమవుతుంది. సిరిసిల్ల అభివృద్ధి దృష్ట్యా.. రోజు రోజుకు పట్టణం విస్తరిస్తుంది. సిరిసిల్ల బైపాస్ అనుమతులు రోడ్డు సమీపంలో నిర్మాణాలకు ఇవ్వకపోవడంతో నిర్మాణదారులు ఇబ్బందులు పడటమే కాకుండా మున్సిపల్ కూడా ఆదాయం కొల్పోతుంది.

సిరిసిల్లలో విలువైన లే అవుట్ స్థలాలు ఉన్న.. ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న విలువైన స్థలాల్లో ఏమైన భవన నిర్మాణాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించి అద్దెకు ఇచ్చిన.. ఆదాయం వచ్చే అవకాశం ఉన్న మున్సిపల్ చట్టం ప్రకారం ఈ అవకాశం లేకపోవడంతో ఏం చేయలేకపోతున్నారు. సిరిసిల్లలో వీవీఐపీలు, మంత్రుల పర్యటన ఉంటే మున్సిపల్ కు ఇది అదనపు ఖర్చులు, మంత్రి కేటీఆర్ స్పెషల్ ఫండ్ ఇస్తేనే సిరిసిల్ల మున్సిపల్ ఆర్థిక కష్టాల్లోంచి గట్టేక్కే పరిస్థితి ఉందనే పాలకవర్గంలో చర్చ కొనసాగుతోంది.

First published:

Tags: Local News, Siricilla, Telangana

ఉత్తమ కథలు