హోమ్ /వార్తలు /తెలంగాణ /

Siricilla: మున్సిపల్ చైర్మన్ భర్త నిర్వాకం.. యువకుడి నిరసన..

Siricilla: మున్సిపల్ చైర్మన్ భర్త నిర్వాకం.. యువకుడి నిరసన..

X
అధికారం

అధికారం చెలాయిస్తున్న మహిళా చైర్మన్ భర్త

Siricilla: వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు యం.ఏ ఇర్షత్ అనే యువకుడు, స్థానిక BSP నాయకులతో కలిసి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

K.Haribabu,News18, Rajanna siricilla

వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు యం.ఏ ఇర్షత్ అనే యువకుడు, స్థానిక BSP నాయకులతో కలిసి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుబాష్ నగర్ కు చెందిన ఇర్షత్ అనే యువకుడు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో 2 సంవత్సరాల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన చెత్త తరలించే ఆటో డ్రైవర్ గా పని చేశాడు. ఒక్కరోజు డ్యూటీకి 10 నిముషాలు లేటుగా రావడంతో గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ శ్యాం సుందర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ భర్త కలిసి డ్యూటీకి రావద్దని వెళ్లగొట్టారని, ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనర్ ను ఇప్పటికి 3 సార్లు కలిసిన న్యాయం జరగడం లేదని వాపోయాడు బాధితుడు.

ఇంటర్వ్యూ ద్వారా పాస్ అయి డ్యూటీ చేస్తున్న నన్ను అకారణంగా తీసివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు ఇర్షత్ తెలిపాడు. దీనిపై నాకు న్యాయం జరగడం లేదని మున్సిపల్ కార్యాలయం నందు, స్థానిక BSP టౌన్ అధ్యక్షులు తాళ్లపెల్లి నాగరాజ్, బహుజన సమాజ్ పార్టీ నాయకులతో కలిసి నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని MA ఇర్షత్ కు న్యాయం చేయాలని తాళ్లపెల్లి నాగరాజ్ తెలిపారు. ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎంట్రన్స్ వద్ద బైఠాయించి నిరసన తెలిపాడు. తనకు న్యాయం జరగకుంటే ఆమరణ నిరాహార దీక్ష సైతం చేస్తానని, పురుగుల మందు తాగుతానని ఆవేదనకు గురయ్యాడు.

మున్సిపల్ కార్యాలయం ముందు ప్లకార్డులు చేతబూని నిరసన తెలుపగా బీఎస్పీ నాయకులు సైతం మద్దతు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వేములవాడ రూరల్ ఎస్సై నాగరాజు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని వారిని నిరసన విరమింపజేశారు. అనంతరం వారు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ భర్త జోక్యంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం..3 వేల పేజీలతో ఈడీ తొలి ఛార్జ్ షీట్ దాఖలు

మున్సిపల్ కార్యాలయంలో జరగాల్సిన వ్యవహారాల పట్ల చైర్పర్సన్ లేదా కమిషనర్, ఇతర అధికారులు నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆదేశాలు జారీ చేయాలని, కానీ మున్సిపల్ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేని చైర్ పర్సన్ భర్త రాజు కార్మికుడు ఇర్షద్ విషయంలో జోక్యం చేసుకోవడం ఏంటని, అతన్ని పనికి రావద్దని అనడంలో ఆంతర్యం ఏమిటని బీఎస్పీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయంపై మేనేజర్ తో పూర్తి విచారణ జరిపించి పూర్తి సమాచారం తెలుసుకుంటానని మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తెలిపారు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు