హోమ్ /వార్తలు /తెలంగాణ /

Siricilla: ఇది కేటీఆర్ ఇజ్జత్ కా సవాల్.. సిరిసిల్లకు ఆ సౌకర్యం నిల్..!

Siricilla: ఇది కేటీఆర్ ఇజ్జత్ కా సవాల్.. సిరిసిల్లకు ఆ సౌకర్యం నిల్..!

సిరిసిల్లకు సూపర్ లగ్జరీ సర్వీస్ కరవు

సిరిసిల్లకు సూపర్ లగ్జరీ సర్వీస్ కరవు

Siricilla: అభివృద్ధిలో సిరిసిల్ల దూసుకెళ్తుందని స్థానిక టిఆర్ఎస్ నాయకుల ప్రగల్బాలు. నెలకో కొత్త ప్రాజెక్టు సిరిసిల్లకు వస్తుందని పతాక శీర్షికల్లో వార్తలు..ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు జిల్లా కేంద్రంకి సరైన ప్రయాణ సౌకర్యం కరవు. చీకటి పడుతుందంటే చాలు సిరిసిల్ల నుండి ప్రయాణం చేయడానికి నిత్యం అగచాట్లు పడుతున్నా ప్రయాణికులు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar | Telangana

Haribabu, News18, Rajanna Sircilla

సిరిసిల్ల (Siricilla).. తెలంగాణ (Telangana)లో పరిచయం అక్కర్లేని పేరు. కేటీఆర్ ప్రాతినిత్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం. సిరిసిల్లకే నిధులన్నీ తరలించుకుపోతున్నారంటూ తరచూ ప్రతిపక్షాల గగ్గొలు. అభివృద్ధిలో సిరిసిల్ల దూసుకెళ్తుందని స్థానిక టిఆర్ఎస్ నాయకుల ప్రగల్బాలు. నెలకో కొత్త ప్రాజెక్టు సిరిసిల్లకు వస్తుందని పతాక శీర్షికల్లో వార్తలు..ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు జిల్లా కేంద్రంకి సరైన ప్రయాణ సౌకర్యం కరవు. చీకటి పడుతుందంటే చాలు సిరిసిల్ల నుండి ప్రయాణం చేయడానికి నిత్యం అగచాట్లు పడుతున్నా ప్రయాణికులు. రెండు దశాబ్దాల నుండి రైలు కూత ఎప్పుడెప్పుడు విందామా అని జిల్లా ప్రజల ఎదురుచూపు. జిల్లా నలుమూల నుండి ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు కాలం చెల్లిన బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ అవస్థలు పడుతున్నారు. సిరిసిల్ల నడిబొడ్డున ఉన్న బస్టాండ్లో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రయాణికుల నరకయాతన పడుతున్నారు.జిల్లా కేంద్రానికి ఉన్న ఏకైక ప్రజా రవాణా వ్యవస్థ సరైన నిర్వహణ లేక అస్తవ్యస్తమైంది.

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధి చెందింది అని చెప్పడానికైనా ఆ ప్రాంతానికి ఉన్న రవాణా వ్యవస్థ ముఖ్య భూమిక పోషిస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత నూతన జిల్లాగా ఆవిర్భవించి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండడం, గజ్వేల్ సిద్దిపేట సరసన సిరిసిల్ల కూడా చేరి ప్రతిపక్షాలనోళ్లలో నానడం, సిరిసిల్ల నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది రాష్ట్ర స్థాయిలో వార్తల్లో నిలవడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో తెలంగాణలో సిరిసిల్ల పేరు తెలియని వారు ఉండరు అని అనడంలో అతిశయోక్తి లేదు. ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా నిధుల కేటాయింపులో సిరిసిల్లకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల పట్టణానికి లోపల, వెలుపల విశాలమైన రహదారులు నిర్మిస్తూ, పెట్టుబడిదారుల చూపు సిరిసిల్ల పైన పడేలా చేస్తున్నారు.

ఇది చదవండి: 80ఏళ్లుగా ఆ గ్రామానికి రోడ్డులేదు.. జనం ఇబ్బందులు ఇంతింతకాదయా..!

మంత్రి కేటీఆర్. కేటీఆర్ వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ చూపి వివిధ కంపెనీలు, ప్రాజెక్టులతో తన సొంత నియోజకవర్గం సిరిసిల్లాను రాజకీయ కంచుకోటలా మార్చుకుంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజల్లో తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు కేటీఆర్. కానీ జిల్లా అధికారుల అలసత్వం, స్థానిక నాయకులకు చిత్తశుద్ధి లోపించటం వెరసి జిల్లా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. ప్రజల ప్రధాన సమస్యలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు విఫలం అవుతుండటంతో, సగటు జిల్లా ప్రజానీకం అధికార పార్టీ నేతలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఇది చదవండి: ఆ జిల్లాలో రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భూమిపై హక్కు పత్రాలు

లక్షల నిధులు వెచ్చించి రోడ్లు, డివైడర్లు, లైట్లు ట్యాంక్ బండ్, స్టేడియాలు అభివృద్ధి చేస్తున్నప్పటికీ ఇవేవీ జిల్లా ప్రజలని మెప్పించలేకపోతున్నాయి. ప్రజలు నిత్యం సౌకర్యవంతంగా రాకపోకలు సాగించడానికి ఉపయోగపడే రవాణా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుండడంతో ప్రజలు ఒకింతా అసహనానికి గురవుతున్నారు. ప్రతిరోజు జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తున్న విద్యార్థులు మహిళలు, వృద్ధులు, అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. పాత బస్టాండ్ సిరిసిల్ల పట్టణం నడిబొడ్డున వుండటం, వస్త్ర వ్యాపార, వాణిజ్య సముదాయాలు సిరిసిల్ల పాత బస్టాండ్ కు సమీపంలోనే ఉండటంతో అత్యధిక శాతం ప్రజలు ప్రయాణాల కోసం సిరిసిల్ల పాత బస్టాండ్ నే ఆశ్రయిస్తారు.

ఇది చదవండి: ఏజెన్సీలో లంపిస్కిన్ వ్యాధి కలవరం.. పశువైద్యుల సూచనలు ఇవే..!

సిరిసిల్ల కొత్త బస్టాండ్ ఆర్టీసీ ఆధ్వర్యంలో వుండగా సిరిసిల్ల పాత బస్టాండ్ నిర్వహణ మునిసిపల్ ఆధ్వర్యంలో ఉంది. దీంతో రెండు శాఖల మధ్య సమన్వయ లోపం సిరిసిల్ల పాత బస్టాండుకు శాపంలా మారింది. మున్సిపల్ ఆధ్వర్యంలో ఉన్న సిరిసిల్ల పాత బస్టాండు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు మెరుగుపరచకుండా బస్టాండ్ ని లాభాపేక్షతో వ్యాపార సముదాయాలకు అద్దెకి ఇవ్వడంతో ప్రయాణికుల సమస్యలు మరింత జటిలంగా మారుతున్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటి వ్యాపార దృక్పథం, ఆర్టీసీ అలసత్వంతో ప్రయాణికులకు తిప్పలు తప్పటం లేదు.

ఇది చదవండి: బాడీబిల్డింగ్ లో దూసుకుపోతున్న సింగరేణి యువకుడు

సిరిసిల్ల పాత బస్టాండ్ నుండి నిత్యం వందలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటే, బస్టాండ్ లో బస్సుల కోసం నిరీక్షించడానికి కేవలం 40 మందికి మాత్రమే సామర్థ్యం ఉండటం, సిరిసిల్ల బస్టాండ్ లోని పరిస్థితులకు అద్దం పడుతుంది. పక్కనే ఉన్న జిల్లా కేంద్రాలైనటువంటి సిద్దిపేట, కామారెడ్డికి ప్రయాణాలు సాగించాలంటే ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. సరైన బస్సు లేక, సరైన సమయానికి రాక ప్రయాణికుల ఓపికకు పరీక్ష పెడుతున్నాయి. ముఖ్యంగా సిరిసిల్ల నుండి 55 కి.మీ వున్న కామారెడ్డికి వెళ్లాలంటే ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చవిచూడాల్సిందే. కామారెడ్డికి ఎక్స్ ప్రెస్ బస్సులు లేకపోవడం ఆర్డినరీ బస్సులే దిక్కవడంతో కామారెడ్డి ప్రాంతం నుంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడానికి జిల్లా ప్రజలు ఆలోచించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.

ఇది చదవండి: నల్లమలలో గుప్త నిధుల తవ్వకాలు.., నిధి దొరికిందా..? పురాతన ఆలయాల వద్ద ఏం జరుగుతుంది..?

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ పేరుతో రెండు ఆర్టీసీ డిపోలు ఉన్నప్పటికీ జిల్లా ప్రజలకు, మరియు జిల్లాకు వచ్చే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంలో విఫలమవుతున్నాయి. సౌకర్యాలు మెరుగ్గా ఉండి అత్యధునిక బస్సులైనా ఇంద్రా, సూపర్ లగ్జరీ లాంటి బస్సులు జిల్లా రోడ్లపై పరుగులు పెడుతుంటే చూడాలని జిల్లా వాసుల కోరిక, కళా గానే మిగిలిపోతుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సిరిసిల్ల బస్ డిపోకి ప్రస్తుతం ఒక్క సూపర్ లగ్జరీ బస్సు కూడా లేకపోవడం శోచనీయం. ప్రైవేట్ భాగస్వామ్యంతో కొన్ని ఎక్స్ ప్రెస్ బస్సులు ఉన్న అవి జిల్లా ప్రజల ప్రయాణాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. సిరిసిల్ల పాత బస్టాండ్ లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. సిరిసిల్ల పాత బస్టాండ్ నుండి ప్రయాణం చేయాలంటే కాలాల కనుగుణంగా ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణకాల్సిందే.

ఇది చదవండి: ఫ్రాంచైజీ స్నాక్ సెంటర్‌తో లాభమా..? నష్టమా..? రెగ్యులర్‌కి బిన్నంగా యువకుడి ఆలోచన

చిన్నపిల్లలతో ప్రయాణం చేసేవారు కూడా నిలువ నీడ లేకుండా కూర్చునేందుకు సరైన స్థలం లేక గంటల తరబడి దుకాణ సముదాయాల ముందు నిరీక్షిస్తూ, తమ దుకాణాల ముందు నుంచి పక్కకు జరగాలంటూ దుకాణదారుల చిదరింపులు, చీత్కారాల మధ్య, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చుకొని ప్రయాణం చేయవలసి ఉంటుంది. బస్టాండ్లో ఇస్టాను రీతిగా పార్కింగ్ చేసిన వాహనాలు ఒకవైపు, ఫుట్ పాత్ లపైకి చొచ్చుకు వచ్చిన దుకాణాలు మరోవైపు ప్రయాణికుల ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి. దీంతో సిరిసిల్ల బస్టాండ్ నుంచి ప్రయాణాలు చేయాలంటే జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ మరియు ఆర్టీసీ అధికారులు వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజల సౌకర్యాలపై దృష్టి పెట్టి ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అంతే కాకుండా కోట్ల నిధులు వెచ్చించి ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడని అభివృద్ధి పనుల కంటే, జిల్లాకు ఆయువు పట్టైనా ఏకైక ప్రజా రవాణా వ్యవస్థను గాడిలో పెట్టి, జిల్లా కేంద్రంలోని పాత బస్టాండును ఆధునికరించి ప్రయాణికుల యొక్క ప్రధాన అవసరాన్ని తీర్చాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Local News, Siricilla, Telangana

ఉత్తమ కథలు