హోమ్ /వార్తలు /తెలంగాణ /

She Teams: ఒక్క ఫోన్ చేస్తే ఆకతాయిల పని కట్టు.. సిరిసిల్లలో మహిళలకు అండగా షీ టీం

She Teams: ఒక్క ఫోన్ చేస్తే ఆకతాయిల పని కట్టు.. సిరిసిల్లలో మహిళలకు అండగా షీ టీం

షీ

షీ టీం

పాఠశాల, కళాశాలలో, బస్టాప్, పని చేసే ప్రదేశాల్లో ఇతర ప్రాంతాలలో ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తూ కనిపిస్తే వెంటనే షీ టీం పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 7901132141కు లేదా డయల్ 100కు కాల్ చేయాలన్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (K. Haribabu, News18, Rajanna siricilla)

  రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా ఎస్పీ రాహుల్ (SP Rahul) హెగ్డే ఆదేశానుసారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కళాశాల విద్యార్థినిలకు 'షీ టీం (She Team)' సేవలపై అవగాహన కల్పించారు మహిళా పోలీసులు (Women Police). సిరిసిల్ల నియోజకవర్గం పరిధి తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో (Telangana Tribal Gurukula Women's Degree College) ఇటీవల నిర్వహించిన ఈ 'షీ టీం అవగాహన సదస్సు' కార్యక్రమంలో ఎస్.ఐ నవత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ నవత మాట్లాడుతూ జిల్లాలో మహిళల హక్కులు, రక్షణ కోసం షీ టీం ప్రత్యేకంగా పనిచేస్తుందన్నారు.

  విద్యార్థినులను వేధింపులకు గురిచేసినా, ర్యాగింగ్‌కి (Ragging) పాల్పడ్డా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాఠశాల, కళాశాలలో, బస్టాప్, పని చేసే ప్రదేశాల్లో ఇతర ప్రాంతాలలో ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తూ కనిపిస్తే వెంటనే షీ టీం పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 7901132141కు లేదా డయల్ 100కు కాల్ చేయాలన్నారు.

  తక్షణమే పట్టుకొని వారిపై చర్యలు..

  రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా హాట్‌స్పాట్‌లను గుర్తించి, ఆ ప్రాంతాల్లో మఫ్టీలో పోలీస్ నిఘా ఉంచి యువతులను, స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని తక్షణమే పట్టుకొని వారిపై చర్యలు తీసుకుంటుంటామని ఎస్ఐ నవత హెచ్చరించారు. పట్టుబడిన అకాత్యాయిలను వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సిలింగ్ నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.

  ప్రస్తుత రోజులో యువతుల్లో సెల్‌ఫోన్ వినియోగం ఎక్కువైందని దానివల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందన్నారు. సోషల్ మీడియాకు అలవాటు పడి సమయం వృథా చేసుకోకుండా యువతులు చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. అదేవిధంగా షీ టీం పని విధానం, పొక్సో చట్టం, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్స్, గుడ్ టచ్, బాడ్ టచ్, అమ్మాయిల వేధింపులపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.

  మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో స్నేహభావంతో మెలగవద్దని, వారి వారి ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే విధిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని తెలిపారు. ఆధైర్య పడవద్దని మహిళలకు అండగా షీ టీం ఎల్లవేళలా పనిచేస్తుందని పేర్కొన్నారు. తమ ఇబ్బందులపై ధైర్యంగా ఫిర్యాదులు చేయాలని తద్వారా ఆకతాయిల అటకట్టించవచ్చని ఎస్ఐ నవత వివరించారు. షీ టీం ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తుందని అన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, She teams, Siricilla, Students

  ఉత్తమ కథలు