Home /News /telangana /

RAJANNA SIRCILLA SIRCILLA RURAL POLICE CRACKED THE MURDER MYSTERY WIFE KILLED HUSBAND WITH THE HELP OF LOVER RKH BRV PRV

Rajanna Sircilla: వామ్మో.. ఈమె మామూలు లేడీ కాదు.. స్నేహితులతో కలిసి భర్తను ఏం చేసిందో తెలుసా?

నిందితులను అరెస్టు చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు 

నిందితులను అరెస్టు చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన పల్లె నర్సింహులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. నర్సింహులు భార్యే... ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి హత్య చేసిందని సిరిసిల్ల రూరల్ సీఐ బి.ఉపేందర్ తెలిపాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India
    (K. Haribabu, News 18, Rajanna Sircilla)

    రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన పల్లె నర్సింహులు హత్య (Murder) కేసును పోలీసులు ఛేదించారు. నర్సింహులు భార్యే.. ప్రియుడు, అతని స్నేహితులతో (Friends)కలిసి హత్య చేసిందని సిరిసిల్ల రూరల్ సీఐ బి.ఉపేందర్ తెలిపాడు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశామని గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం..ఆగష్టు 11న నర్సింహులు (35) తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతని తల్లి ఎల్లవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరిపారు. మృతుడి భార్య మమతే తన ప్రియుడు బెల్లె సురేశ్, అతని స్నేహితులు సాయి, విష్ణులతో కలిసి నర్సింహులును చంపేందుకు పథకం వేసిందని తేల్చారు. భర్తకు అన్నంలో నిద్రమాత్రలు కలిపిందని, అతను తిన్న తర్వాత నలుగురూ కలిసి, చున్నీతో ఉరివేసి హత్య చేశారని సీఐ వివరించారు. మమత, సురేశ్, సాయిలను అరెస్టు చేయగా విష్ణు పరారీలో ఉన్నాడని తెలిపారు.

    మొక్కలు నాటేందుకు వచ్చి..

    హరితహారంలో (Harita Haram) భాగంగా మొక్కలు నాటేందుకు వచ్చిన ఓ దినసరి కూలీ గుండెపోటుతో మృతిచెందాడు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి సమీపంలోని గురువన్నపేటకు చెందిన తులవేణి లక్ష్మయ్య (50) ఉపాధి నిమిత్తం వేములవాడలోని తిప్పాపూరం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. మున్సిపాలిటీ పరిధిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే పనుల నిమిత్తం దినసరి కూలీగా వెళ్తున్నాడు. గురువారం చెక్కపల్లి రహదారి వెంట మొక్కలు నాటుతుండగా గుండెపోటుకు గురై లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పట్టణ ప్రణాళికా విభాగం అధికారి శ్రీధర్‌ను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా... కాంట్రాక్టర్ కిశోర్ ద్వారా పనులు జరుగుతున్నాయని, ఆయన సమీప బంధువైన లక్ష్మయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడని తెలిపారు.

    Rajanna Sircilla: భర్తే కాలయముడు: సిరిసిల్ల మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు


    చిరుత దాడిలో లేగ దూడ మృతి:

    రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్లలో గురువారం తెల్లవారుజామున లక్ష్మణ్ అనే రైతుకు చెందిన లేగదూడపై చిరుత (Cheetah) పులి దాడి చేసి, చంపిందని స్థానికులు తెలిపారు. ఫారెస్టు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ముచ్చర్ల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, ప్రయాణికులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. రైతులు, అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే వారు భయాందోళనలకు గురవుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Local News, Siricilla

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు