Home /News /telangana /

RAJANNA SIRCILLA SIRCILLA POWER LOOMS ARE BUSY IN MAKING TRICOLOR FLAGS AS AUGUST 15 INDEPENDENCE DAY IS APPROACHING RKH ABH BRV

Rajanna Sircilla: ఇంటింటికీ తిరంగా.. జెండా తయారీతో నేతన్నలకు చేతినిండా పని..

జాతీయ

జాతీయ జెండాలు తయారు చేస్తున్న చేనేత కార్మికులు

తెలంగాణ రాష్ట్రంలో 1.20 కోట్ల జెండాలు అవసరం ఉండగా సిరిసిల్ల నేతన్నలకి 30 లక్షల విలువ చేసే పాలిస్టర్ వస్త్రానికి అర్డర్ వచ్చింది. పవర్ లూమ్స్ పై వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి మూడు రంగుల జెండాలను తయారు చేస్తున్నారు

    (K.Hari Babu, News 18, Rajanna Sircilla)

    భారతదేశానికి స్వాంతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి ఇంటిలో జాతీయ జెండా ఎగుర వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు పురష్కరించుకుని ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు, ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఇంటిలో జాతీయ జెండా ఎగుర వేయాలంటూ అధికార బీజేపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. అదే సమయంలో కోట్ల సంఖ్యలో తిరంగా జెండాలు అవసరం ఉండగా, ఆమేరకు జెండాల తయారీలో నేత పరిశ్రమలు ఎంతో బిజీగా ఉన్నాయి.

    ఇంటింటికి తిరంగా కార్యక్రమం నేపథ్యంలో జాతీయ జెండాల తయారీ ఊపందుకుంది. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి మరో రెండు వారాల గడువు మాత్రమే ఉండగా వందలాది మంది కార్మికులు జెండాల తయారీలో నిమగ్నమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో 1.20 కోట్ల జెండాలు అవసరం ఉండగా సిరిసిల్ల నేతన్నలకి 30 లక్షల విలువ చేసే పాలిస్టర్ వస్త్రానికి అర్డర్ వచ్చింది. పవర్ లూమ్స్ పై వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి మూడు రంగుల జెండాలను తయారు చేస్తున్నారు. ప్రత్యక్షంగా సుమారు 1200 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 38588 పవర్ లూమ్స్ ఉండగా ఒక్క సిరిసిల్లలోనే 28494 పవర్ లూమ్స్ ఉన్నాయి. 4116 సాంచాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. అతి తక్కువగా 18 సాంచాలతో రంగారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉంది. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కో కొనుగోలు చేస్తుంది. వస్త్ర నాణ్యత, పొడవు, వెడల్పును బట్టి మీటరు వస్త్రానికి రూ.13 నుండి రూ. 16 వరకు చెల్లించాలని నిర్ణయించారు.

    సిరిసిల్లలోనే 30 లక్షల మీటర్ల వస్త్రం కోనుగోలుకి ప్రణాళిక: దేశంలోని నాలుగు రాష్ట్రాల నుండి సిరిసిల్ల నేతలకు అర్డర్స్ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల నుండి అర్డర్స్ వచ్చాయి. ప్రస్తుతం సిరిసిల్లలో విద్యుత్ సమస్య ఉందని, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో అరకొరగా పని కొనసాగిస్తున్నట్లు యజమానులు చెబుతున్నారు. విద్యుత్ లేకపోవడం వలన వర్క్ అగిపోతుందని చెబుతున్నారు.

    కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ భక్తి పెంపోందడంతో పాటు నేతన్నలకి ఉపాధి దొరుకుతుంది. సిరిసిల్లలో విద్యుత్ కొరత లేకపోతే నిరాటంకంగా పనులు కొనసాగించి సమయానికి తిరంగా జెండాలు అందిస్తామని కార్మికులు అంటున్నారు. జాతీయ జెండాలు తయారీ చేయడం గర్వకారణంగా ఉందని, మా ద్వారా మరో 100-150 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని వస్త్ర తయారీదారులు తెలిపారు. ఇతర ఆర్డర్స్ వచ్చినా తక్కువ సమయంలోనే జెండాలను అందిస్తామని పవర్ లూమ్ యజమాని చక్రపాణి అంటున్నారు.

    సిరిసిల్ల పవర్ లూమ్, చక్రపాణి ఫోన్ నెంబర్: 8099033222.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు