(Haribabu, News18, Rajanna Sircilla)
ఊరువాడా ఏకమై జరుపుకునే పండుగ గణేశ్ చతుర్థి (Ganesh Chaturthi) . దేశ సమైక్యతను చాటేలా ప్రతి ఒక్కరు వినాయక పండుగ జరుపుకుంటారు. ఇక వినాయక చవితి (Vinayaka Chaviti) అనగానే గుర్తొచ్చేది గణేశుడి విగ్రహాలు, అందంగా అలకరించుకునే మండపాలు. వాడవాడన గణేశుడి విగ్రహాలు (Ganesh Idols) ఏర్పాటు చేసి యువకులు ఎంతో సందడిగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల ఆసాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది గణేశుడి విగ్రహాలు, మండపాలు. వినాయకుడికి ప్రత్యేకతతో కూడిన మండపాలు తయారు చేస్తూ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాకు చెందిన ఓ కళాకారుడు. అయోధ్య రామ మందిరం తరహాలో ఆకృతిని తయారు చేసి అందులో గణేషుడిని ప్రతిష్టించి భక్తితో పాటు తన ప్రతిభను చాటుకుంటున్నాడు ఆ వ్యక్తి.
ప్రత్యేక ఆకృతిలో మండపం..
రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బివైనగర్ కు చెందిన నేత కార్మికుడు దీకొండ ఆశోక్ (Dheekonda Ashok). చేనేతతో పాటు పలురకాల కళాఖండాలు రూపొందించే అశోక్.. ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక ఆకృతిలో మండపం తయారు చేసి అందులో వినాయకుడిని ప్రతిష్టించి పూజిస్తున్నాడు. గత ఐదేళ్లుగా అశోక్ రూపొందించిన పలు ఆకృతులు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈనేపథ్యంలోనే ఈ ఏడాది సైతం అయోధ్య (Ayodhya) రామమందిరం తరహాలో కళాకృతిని తయారు చేసిన కళాకారుడు అశోక్.. అందులో వినాయకుడిని ప్రతిష్టించి భక్తిని చాటుకున్నారు. థర్మోకోల్తో నెల రోజులపాటు శ్రమించి రామ మందిరాన్ని (Rama Temple నిర్మించినట్లు న్యూస్ 18కు తెలిపాడు అశోక్.
గత నాలుగేళ్లుగా ఇలాంటి ఆకృతులు (Shapes/Forms) తయారు చేస్తున్నాడు అశోక్. మొదటి సంవత్సరం అసెంబ్లీ మోడల్ (Assembly model), 2వ సంవత్సరం తిరుపతి వెంకన్న దేవాలయం, 3వ సంవత్సరం గుర్రాల రథం, ఈ సంవత్సరం ఆయోధ్య రామ మందిరాన్ని తయారు చేసి తన ప్రభతిభను చాటుకున్నాడు. దీకొండ ఆశోక్ కూతురు శీరిష సైతం ప్రముఖ గాయినిగా రాణిస్తుంది.
సిరిసిల్ల (Sircilla) అనగానే మనందరికీ చేనేత కార్మికులే గుర్తుకొస్తారు. చేనేత కార్మికులు హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ వృత్తి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల పట్టణంలో.. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించి చేనేత కార్మికుడు అశోక్ అబ్బురపరుస్తున్నాడు. ఇది నిర్మించడానికి నెలరోజుల పాటు సమయం పట్టిందని పేర్కొన్నాడు.
Nagarkurnool: ఏడుకొండల వెంకన్న ధరించే ఏరువాడ జోడు పంచెలకు ఇంత విశేషం ఉందా?
గతంలో సిరిసిల్ల చేనేత కళాకారులు కార్మికులు తన నైపుణ్యాన్ని, కలలను.. జెండాల తయారీ, బతుకమ్మ చీరలు, పరిమళించే పట్టుచీర, అగ్గిపెట్టెలో పట్టే చీర, పలు వస్త్రాలపై సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ , ఇందిరా గాంధీ, నెహ్రు, ఫోటోలను నేసి అందరిని దృష్టిని ఆకర్షించారు. అయోధ్య రామ మందిరం తరహాలో వినాయక మండపం తయారు చేసిన అశోక్ ను పలువురు అభినందించారు. కొత్త కొత్త కళలు, కళా రూపాలను రూపొందించడం అంటే ఇష్టమని కళాకారుడు అశోక్ పేర్కొన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya Ram Mandir, Local News, Siricilla