హోమ్ /వార్తలు /తెలంగాణ /

క్యూ ఆర్ కోడ్ ద్వారా షీటీమ్స్ ఫిర్యాదుల స్వీకరణ.. మహిళలకు మరింత భరోసా..

క్యూ ఆర్ కోడ్ ద్వారా షీటీమ్స్ ఫిర్యాదుల స్వీకరణ.. మహిళలకు మరింత భరోసా..

సిరిసిల్లలో క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ

సిరిసిల్లలో క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ

మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police Department) ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన షీ టీంలు (She Teams) మహిళలకు, విద్యార్థినులకి ఎంతో ధైర్యాన్ని కల్పిస్తున్నాయని ఆకతాయిల వేధింపులపై మహిళల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే మహిళా పోలీసులు వారి పని పడుతున్నారని రాజన్నసిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police Department) ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన షీ టీంలు (She Teams) మహిళలకు, విద్యార్థినులకి ఎంతో ధైర్యాన్ని కల్పిస్తున్నాయని ఆకతాయిల వేధింపులపై మహిళల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే మహిళా పోలీసులు వారి పని పడుతున్నారని రాజన్నసిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం పనిచేస్తున్న జిల్లా షీ టీమ్ ఇక్కడి మహిళలకు ఎంతగానో చేరువైందని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో షీ టీం సేవలపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమాలు చక్కటి ఫలితాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగా  సెప్టెంబర్ నెలలో   రాజన్న సిరిసిల్ల జిల్లా షీ టీంకు వివిధ రకాల ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదుల్లో ఇద్దరు యువకులపై రెండు పెట్టి కేసులు నమోదు చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు.

  అయితే ఫిర్యాదు సమయంలో ఫిర్యాదు చేసిన మహిళల, బాలికల, వివరాలు ఎక్కడ కూడా బయటపెట్టకుండా వారి యెక్క సమస్యలను కేవలం ఫోన్ ద్వారా లేదా క్యూ ఆర్ కోడ్ ద్వారా చెప్పే అవకాశం కల్పిస్తున్నారు పోలీసులు. దీంతో తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు మహిళల్లో మరింత ధైర్యంతో పాటు పోలీసులపై భరోసా కలుగుతున్నట్లు షీ టీం పర్యవేక్షణాధికారి చెప్పుకొచ్చారు. ఆపద సమయంలో మహిళలు విద్యార్థినులు ఎలా స్పందించాలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  ఇది చదవండి: ఈ రోడ్డెక్కితే డైరెక్టుగా పైకి టికెట్ తీసుకున్నట్లే.. మంత్రిని నిలదీస్తున్న జనం..! ఎక్కడంటే..!

  అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో సిరిసిల్ల, వేములవాడ సబ్ డివిజన్లలో విధులు నిర్వహిస్తున్న షీ టీమ్ బృందాలు జిల్లాలోని పాఠశాలల్లో, కళాశాలల్లో, బస్టాండ్, రద్దీగాల ప్రాంతాల్లో, మహిళాలు పని చేసే ప్రదేశాల్లో సివిల్ డ్రెస్సుల్లో ఉండి ప్రతి రోజు ఆయా ప్రదేశాల్లో నిఘా పెడుతున్నారు. అందులో భాగంగా గత నెలరోజుల్లో షీ టీమ్స్ బృందాలు జిల్లాలో ఉన్న హాట్ స్పాట్స్ ని 66 సార్లు సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా షీ టీమ్ ఎస్.ఐ మరియు సిబ్బంది స్థానికంగా పలు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి షీ టీం పని విధానం, పొక్సో ఆక్ట్, ఈవిటిజింగ్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్స్, గుడ్ టచ్, బాడ్ టచ్, అమ్మాయిల వేధింపులు,పై అవగాహన కల్పించారు. మహిళలు, బాలబాలికాలు వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100 లేదా క్యూ ఆర్ కోడ్, జిల్లా షీ టీమ్ నెంబర్: 7901132141 ద్వారా పిర్యాదు చేయవచ్చు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Karimnagar, Local News, Telangana

  ఉత్తమ కథలు