Haribabu, News18, Rajanna Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ (Vemulawada) అర్బన్ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మండలంలోని రుద్రవరం గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో హుండీ, పెద్దమ్మ ఆలయంలో అమ్మవారి పుస్తే, మెట్టెలు, హుండీ డబ్బులు, ఆరేపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయంలో హుండీని, అనుపురం గ్రామంలోని రామాలయంలో హుండీతో పాటు పలు ఆభరణాలను, విలువైన వస్తులను దొంగలు అపహరించారు. సీసీ పుటేజీలో పోలీసులు చోరీ దృశ్యలను పరిశీలించారు. గతంలోనూ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలోని దేవాలయాల్లో పలు మార్లు దొంగలు హుండీలను పగలగొట్టి డబ్బులు, ఎత్తుకెళ్లిన సంఘటనలు కోకొల్లలు. అయితే గంతంలో జరిగిన దొంగతనాలను పోలీసులు దొంగలను పట్టుకున్నప్పటికీ, ఈ దొంగతనాల హిస్టరీ పోలుసులకు సవాల్ గా మారిందనే చెప్పాలి. వేములవాడ పట్టణ, పరిసర ప్రాంతాల్లో తరచూ చోరీలుజరగటంపై ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.
రుద్రవరం సర్పంచ్ ఊరడి రామ్ రెడ్డి న్యూస్18తో మాట్లాడుతూ.. దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దొంగలను పట్టుకొని బట్టలు విప్పి ఊరేగించాలని అన్నారు. ఇలాంటి దొంగతనాలు మళ్లీ ఇంకెప్పుడు చేయకుండా దొంగలకు అధికారులు కఠిన శిక్షలు వేయాలని కోరారు. గతంలో సైతం అర్బన్ మండలంలోని ఆలయాల్లో దొంగతనాలు జరిగాయని గుర్తు చేశారు. పోలీసు వారు పెట్రోలింగ్ సమయంలో ఆలయ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. దొంగతనాల ఘటనలపై రుద్రవరం బీజేపీ నాయకుడు స్వామి మాట్లాడుతూ.. పోలీసులు దొంగతనాలను సీసీ కెమెరాలు ఆధారంగా పట్టుకుని దొంగతనాల నివారణ కృషి చేయాలని, సీసీ కెమెరాలలో ముగ్గురు యువకులు దేవాలయాల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు కనిపిస్తుందని వెల్లడించారు.
వేములవాడ పట్టణ సీఐ వెంకటేష్ మాట్లాడుతూ.. గతంలో సైతం చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకున్నామని, ఈసారి సీసీ కెమెరాలు ఆధారంగా ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన దొంగలను త్వరితగతిన పట్టుకుని శిక్షపడేలా చేస్తామని అన్నారు. వేములవాడ ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని, ఎక్కడైనా కొత్త వ్యక్తులు, అనుమానితులు కనిపిస్తే.. విధిగా పోలీసు వారికి, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ విధిగా వ్యాపార సముదాయాలతో పాటు ఆలయాలు, ప్రధాన కూడళ్ళ వద్ద సిసి కెమెరాలు ఆమార్చుకోవాలని కోరారు. ప్రతిరోజు అన్ని గ్రామాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana, Vemulawada