హోమ్ /వార్తలు /తెలంగాణ /

కల్యాణోత్సవంలో సిరిసిల్ల పీతాంబరం పట్టు చీరతో కొలువుదీరనున్న సీతమ్మవారు!

కల్యాణోత్సవంలో సిరిసిల్ల పీతాంబరం పట్టు చీరతో కొలువుదీరనున్న సీతమ్మవారు!

X
పట్టుచీర

పట్టుచీర సమర్పణ

Telangana: భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవంలో ఈసారి సీతమ్మవారు సిరిసిల్ల పీతాంబరం పట్టు చీరలో కొలువుదీరనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(K.Haribabu,News18, Rajanna siricilla)

భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవంలో ఈసారి సీతమ్మవారు సిరిసిల్ల పీతాంబరం పట్టు చీరలో కొలువుదీరనున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవంలో స్టేట్ గవర్నమెంట్ నుంచి పట్టు వస్త్రాలను సమర్పించే ఆనవాయితీ ఉన్న విషయం తెలిసిందే. ఈ కోవలో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల పట్టణంలోని నేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్ నేసిన పీతాంబర పట్టుచీరను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేయనున్నారు.

అంతరించిపోయిన పీతాంబరం పట్టుచీరను సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ పునర్జీవం పోశాడనే చెప్పాలి. అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. భద్రాద్రి శ్రీసీతారాముల కళ్యాణంలో సీతమ్మవారికి ఈ పితాంబరం పట్టు చీర అందజేయాలని నేత కార్మికుడు హరి ప్రసాద్ కోరగా మంత్రి కేటీఆర్ సూచన మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కు పీతాంబర పట్టు చీర అందజేశారు. మంత్రి కేటీఆర్ సైతం పీతాంబర పట్టుచీర బాగుందని అభినందించినట్లు తెలిపాడు.

తొలి పీతాంబరం సీతమ్మకు అందజేయడం ఆనందంగా ఉంది: చేనేత నేత కళాకారుడు

అంతరించిపోయిన పితాంబరం పట్టుచీరలను పునర్జీవింపజేయాలనే ఉద్దేశంతో 20 రోజులపాటు కష్టపడి తయారుచేసిన తొలి పీతాంబరం పట్టుచీర సీతమ్మ వారి కల్యాణానికి అందజేయడం ఆనందంగా ఉందని నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తెలిపాడు. తనకి ఈ గౌరవాన్ని కల్పించిన స్థానిక మంత్రి కేటీఆర్ కు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. 150 గ్రాముల వెండి పోగులతో తయారుచేసిన ఈ పట్టు చీర 750 గ్రాముల బరువు ఉంటుందని ఆయన తెలిపారు.

తమ పెళ్లిళ్లకు ఇతర శుభకార్యాలకు పీతాంబర పట్టుచీరలు కావలసినవారు తనను సంప్రదిస్తే వారి అభిరుచి మేరకు చీరలు తయారు చేసి ఇస్తానని ఈ సందర్భంగా సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడనే చెప్పాలి. గతంలో దబ్బనంలో దూరే చీర, అగ్గిపెట్టెలో ఇమిడే చీర, అగ్గి పెట్టెలో ఇమిడే షర్ట్ వంటి అనేక వినూత్న వస్త్రాలను రూపొందించాడు. ఇప్పుడు చేనేత మగ్గంపై పట్టుపీతాంబరం చీరను 20 రోజులపాటు శ్రమించి తయారుచేశాడు. 750 గ్రాముల బరువుతో తయారు చేసిన ఈ చీర కోసం 150 పట్టుదారాలను వినియోగించినట్టు హరిప్రసాద్ పేర్కొన్నాడు.

First published:

Tags: Local News, Rajanna sircilla, Srirama navami, Telangana

ఉత్తమ కథలు