హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: రైతు బజార్లో కూరగాయలు అమ్ముతున్న విద్యార్థులు.., ఎందుకో తెలుసా?

Rajanna Siricilla: రైతు బజార్లో కూరగాయలు అమ్ముతున్న విద్యార్థులు.., ఎందుకో తెలుసా?

కూరగాయలు

కూరగాయలు అమ్ముతున్న విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామంలో కొందరు సంచి చేతబట్టుకుని కూరగాయలు కొనేందుకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  Haribabu, News18, Rajanna Sircilla

  రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామంలో కొందరు సంచి చేతబట్టుకుని కూరగాయలు కొనేందుకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు. అదేంటి.. కూరగాయల కోసం రైతు బజారుకో, మార్కెట్‌కో వెళ్ళాలి గాని స్కూల్‌లోకి ఎందుకు వెళ్తున్నారు అని మీ డౌట్..? అక్కడికే వస్తున్నాం. నిత్యం తరగతి గదిలో పాఠాలు విని విసిగిపోయిన విద్యార్థులకు కాస్త ఆటవిడుపుతో పాటు ప్రత్యక్ష మార్కెట్ వ్యవహారాలపై అవగాహన కల్పించేలా స్కూల్ విద్యార్థులచే స్వయంగా రైతు బజార్ నిర్వహించారు పాఠశాల ఉపాధ్యాయులు. పాఠశాలలో ఏర్పాటు చేసిన రైతు బజార్లో విద్యార్థులు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులను రైతుబజార్‌కు తీసుకొచ్చి అమ్మారు.

  ఈ సందర్భంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కనపర్తి దివాకర్ విద్యార్థులకు రైతుబజార్ మార్కెట్ నిర్వహణ గురించి వివరించారు. రైతులు ఏ విధంగా తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా రైతుబజార్‌కు తీసుకువచ్చి విక్రయిస్తారు, రైతు బజార్లో కూరగాయలు నేరుగా ప్రజలకు అమ్మడం ద్వారా తక్కువ ధరకు లభిస్తాయి, దళారీ వ్యవస్థ వంటి విషయాలపై అవగాహన కల్పించారు. ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో రైతు బజార్ల నిర్వహణ గురించి పాఠ్యాంశాన్ని ఇలా ప్రత్యక్షంగా విద్యార్థులతోనే రైతుబజార్ నిర్వహించి అవగాహన కల్పించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

  ఇది చదవండి: రైతుల భలే తెలివి.., పంటచేలోకి అడవి పందులు, పక్షులు రాకుండా ఏం చేశారో చూడండి

  ఈ ప్రయోగాత్మక అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు ఎంత కష్టపడతాడో..మార్కెట్ నిర్వహణ ఎలా ఉంటుంది అనే అంశాలపై ఉపాధ్యాయులు వివరించిన ప్రాక్టికల్ ప్రోగ్రాం ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలిపారు.

  విద్యార్థులకు బయటి పరిస్థితులపై అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు చేసిన ఈ ఆలోచనను గ్రామ ప్రజలు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సేంద్రియ వ్యవసాయం, రైతుల స్థితిగతులు, రైతు బజార్లలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం వంటి విషయాలు క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఇలా ప్రయోగాత్మకంగా చేసి చూపించడం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. పాఠ్యాంశాన్ని ప్రోగ్రాం ద్వారా నిర్వహిస్తే వారు ఎప్పటికీ మర్చిపోరని, పాఠాలపై మరింత ఆసక్తి కలగడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తుందని ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Telangana, Vemulawada

  ఉత్తమ కథలు