హోమ్ /వార్తలు /తెలంగాణ /

మర్డర్ కేసులో కోడి అరెస్ట్ అనే వైరల్ వార్త మీరూ చూశారా?.. దాని అసలు కథ ఇది..

మర్డర్ కేసులో కోడి అరెస్ట్ అనే వైరల్ వార్త మీరూ చూశారా?.. దాని అసలు కథ ఇది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక వ్యక్తి మృతి కేసులో పోలీసుల కోడిని అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండాపూర్‭లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

సాధారణంగా ఏదైనా మర్డర్ జరిగినప్పుడు.. దానికి కారణం అయిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. అయితే ఓ మనిషిని చంపిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేస్తారు. నేరం కోర్టులో రుజువైతే.. కోర్టు దోషిగా తేల్చిన తర్వాత వారికి శిక్షలు వేస్తుంటారు. అయితే ఆ మధ్య ఓ కోడి మృతి కేసు దేశంలో చర్చనీయాంశమైంది. తన పొరుగింటి వ్యక్తి దురుద్దేశంతో కుట్రపన్ని తన కోడిని హతమార్చాడంటూ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్‭లో కేసు నమోదు చేశాడు. అప్పట్లో ఈ కేసు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఓ కోడి ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇది ఎక్కడో వేరే రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే. మన తెలంగాణలోనే ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అయితే  ఇది చాలా పాత కేసు... ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచి వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే... ఒక వ్యక్తి మృతి కేసులో పోలీసుల కోడిని అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండాపూర్‭లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. కొండపూర్‭కు చెందిన సత్తయ్య (45) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అయితే సత్తయ్య ప్రాణం.. తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కోడియే తీసింది. కోడి కాలికి కట్టిన కత్తి పొరపాటున సత్తయ్య పొట్టలో గుచ్చుకుంది. దీంతో సత్తయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సత్తయ్య మృతికి కారణమైన కోడిని అరెస్ట్ చేశారు.

కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. సత్తయ్య మృతికి కోడే ఏ-1 ముద్దాయిగా చేర్చి పోలీస్ స్టేషన్‭కు తీసుకొచ్చారు. ఇక కోడిని తొందరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు కూడా వారు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కోడి కేసు అంతటా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఘటన జరిగి ఏడాది అయిన తర్వాత కూడా ఇప్పుడు మరోసారి ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది.

First published:

Tags: Chicken, Jagityal, Jagityala, Local News

ఉత్తమ కథలు