హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganesh Idols: మనం మొక్కే ఆ వినాయకుడు ఈ చేతుల సృష్టే..! కానీ వారి పరిస్థితి మాత్రం..!

Ganesh Idols: మనం మొక్కే ఆ వినాయకుడు ఈ చేతుల సృష్టే..! కానీ వారి పరిస్థితి మాత్రం..!

వినాయక

వినాయక విగ్రహాలు తయారు చేస్తున్న రాజస్తాన్ కళాకారులు

Vinayaka Chavithi: ఊరూవాడా ఏకమై అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. అన్ని విఘ్నాలను తొలగించి చేయబోయే కార్యం సిద్ధించేలా ఆ గణనాధుడు రక్షిస్తాడని హిందువుల విశ్వాసం. ఇక వినాయక ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఆ గణనాథుడి విగ్రహ రూపం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar | Telangana

  Haribabu, News18, Rajanna Sircilla


  ఊరూవాడా ఏకమై అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. అన్ని విఘ్నాలను తొలగించి చేయబోయే కార్యం సిద్ధించేలా ఆ గణనాధుడు రక్షిస్తాడని హిందువుల విశ్వాసం. ఇక వినాయక ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఆ గణనాథుడి విగ్రహ రూపం. ప్రజలు ఎంతో ఉత్సాహంతో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుని భక్తి ప్రపత్తులతో ఈపండుగ జరుపుకుంటారు. ఏటా దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనం జరుగుతుంది. ఇక ఈ విగ్రహాల తయారీతో పేద కళాకారులు ఉపాధి పొందుతున్నారు. కొందరు వంశపారంపర్యంగానూ ఈ విగ్రహాల తయారీని అందిపుచ్చుకుంటున్నారు. తెలంగాణ (Telangana) లోని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla) వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులో గత 15 ఏళ్లుగా వినాయక విగ్రహాల తయారీతో ఉపాధి పొందుతున్నారు కొందరు కళాకారులూ. రాజస్థాన్ నుంచి వచ్చిన (ఖాంగర్జీ) వలస కూలీలు కళాకారులాగా మారి వివిధ రూపాల్లో గణనాథులను ముస్తాబు చేస్తున్నారు.


  పర్యావరణ హిత విగ్రహాలు
  వేములవాడ పరిధిలోని వివిధ మండలాలు, ప్రాంతాల్లో పీఓపీ (ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) తో చేసిన విగ్రహాలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు ఈసారి దాదాపు అధిక మొత్తంలో గణేష్ ప్రతిమలు తక్కువ ఎత్తుతో నిర్మించినట్లు రాజస్థాన్ కళాకారులు తెలిపారు. సరస్వతి బొమ్మలు, ఏనుగు బొమ్మలు, వివిధ దేవతా మూర్తుల విగ్రహాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని వారు చెబుతున్నారు. ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఇళ్లలో ప్రత్యేక ఆకర్షణగా ఉండే బొమ్మలను సైతం ఆర్డర్ పై తయారు చేస్తామంటున్నారు. సినిమా షూటింగ్స్‌కు సంబంధించిన ప్రత్యేకమైన కళారూపాలను తయారు చేస్తామని చెప్పుకొచ్చారు.


  ఇది చదవండి: సిరిసిల్లలో సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సీన్‌ రిపీట్‌..! ఏంటో మీరే చూడండి..!


  కోలుకోలేని దెబ్బ కొట్టిన కరోనా

  గత 15 ఏళ్లుగా వినాయక విగ్రహాల తయారీతో ఉపాధి పొందుతున్న ఈ కళాకారులపై కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. గడిచిన మూడేళ్ళలో కరోనా, లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం బహిరంగ ఉత్సవాలపై నిషేధం విధించడంతో విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. కరోనా విపత్కర సమయంలో విగ్రహ ప్రతిమలు అమ్ముడుపోక నష్టాల్లో కూరుకుపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా గిరాకీ బాగా ఉండి, లాభాలు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముడి సరుకుపై విధించిన పన్ను (tax) కారణంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వినాయక ప్రతిమల ధరలు పెరిగినట్లు కళాకారులూ తెలిపారు.  ఇది చదవండి: ఉత్తమ గ్రామపంచాయతీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఊరు.. ఇంతకీ వాళ్లేం చేశారంటే..!  ప్రజలు, ప్రభుత్వం సహకరించాలి

  విగ్రహాల తయారీ ద్వారా ఉపాధి పొందుతున్న తమకు ప్రజలు సహకరించాలని రాజస్థాన్ కళాకారులు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విగ్రహాలు తయారు చేస్తున్న కళాకారులకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కళాకారులను వలస కార్మికులుగా గుర్తించి భరోసా కల్పిస్తూ సబ్సిడీ లోన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత కరోనా సమయంలో విగ్రహాలు తయారు చేసేందుకు బంగారం బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ సంవత్సరం విగ్రహాల అమ్మకాల ద్వారా వచ్చే లాభాలతోనే వాటి నుంచి గట్టెక్కగలమని వారు అంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సైతం అనేక ప్రాంతాల్లో గణేష్ ప్రతిమలను రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ కళాకారులు తయారు చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Telangana, Vinayaka Chaviti

  ఉత్తమ కథలు