Home /News /telangana /

RAJANNA SIRCILLA RAJANNASIRISILLA DISTRICT POLICE DEPARTMENT ORGANIZED A TRAINING CAMP FOR GOVERNMENT JOBS SNR RKH BRV

Rajannasircilla: యువత భవిత కోసం పోలీసుల చేయూత .. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఫ్రీ కోచింగ్ సెంటర్

(యువత కోసం పోలీస్‌శాఖ చేయూత)

(యువత కోసం పోలీస్‌శాఖ చేయూత)

Rajannasirisilla: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొందని.. అభ్యర్థులు ప్రణాళిక బద్ధంగా పరీక్షలకు సన్నద్ధం అయితే విజయం సాధించవచ్చని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.

    (K.Haribabu,News18,Rajannasiricilla)
    ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల(Government jobs)కు తీవ్ర పోటీ నెలకొందని.. అభ్యర్థులు ప్రణాళిక బద్ధంగా పరీక్షలకు సన్నద్ధం అయితే విజయం సాధించవచ్చని రాజన్నసిరిసిల్ల (Rajannasirisilla) జిల్లా ఎస్పీ(SP) రాహుల్ హెగ్డే(Rahul Hegde)అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కొరకు జిల్లా పోలీస్ శాఖ (Police department)ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని (Free training camp)ఆయన సందర్శించారు. పట్టణంలోని సినారె కళా మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా (Jindam Kala)స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

    నిరుద్యోగ యువత భవిత కోసం..
    ఈసందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు శిక్షణ నిమిత్తం ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇక్కడ 63 రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకుంటే బలమైన సంకల్పం ఏర్పడుతుందని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధిస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఇక్కడ శిక్షణ తీసుకుని ఉద్యోగాలు సాధిస్తే అదే మాకు పెద్ద బహుమతి అని ఎస్పీ అన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు.



    ఉచిత ట్రైనింగ్ సెంటర్..
    ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఉద్యోగార్ధులకు అవగాహన కల్పించగలిగామని ఎస్పీ రాహుల్ అన్నారు. అదే విధంగా పోలీస్ సెలక్షన్ ప్రాసెస్ గురించి, ఎగ్జామ్ పేపర్ గురించి మరియు చదవాల్సిన పుస్తకాల గురించి నిపుణులతో బెస్ట్ కోచింగ్ ఇస్తున్నట్లు ఎస్పీ వివరించారు. పోలీస్ సెలక్షన్ ప్రాసెస్ ప్రధానంగా మూడు దశలు/రౌండ్లలో జరుగుతుందని.. ప్రిలిమినరీ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఉద్యోగార్థులు నిర్దిష్ట ప్రణాళికతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళితే ఉద్యోగం సాధించవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు చాలా పోటీ ఉందని, అభ్యర్థులు సమయాన్ని వృధా చేయకుండా మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రిపరేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ శిబిరానికి వచ్చిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వారంలో ఒక రోజు మోక్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు వసూలు చేస్తుంటే స్థానిక పోలీసులకు సమాచరం అందించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు.

    Telangana Government Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. 15 రోజుల్లో మరో నోటిఫికేషన్? వివరాలివే


    ఉపయోగించుకొని ఉద్యోగం కొట్టాలి..
    శిక్షణ శిబిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా మాట్లాడుతూ..జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాల నిమిత్తం ఉచిత శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు 63 రోజుల పాటు భోజన వసతి కల్పించినట్లు తెలిపారు. అందుకోసం కృషి చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగాన్నీ, ఫ్యాకల్టీ ఇంచార్జ్‌లను అభినందించారు. పట్టుదలతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే ఉద్యోగార్ధులకు తాము అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి తమ సహకారం ఉంటుందని జిందం కళా భరోసా ఇచ్చారు.

    Love Cheater : ఆమె 8ఏళ్లుగా ప్రేమిస్తే .. అతను పెళ్లి చేసుకొని 5రోజులు కాపురం చేశాడు ..తర్వాత ఏం చేశాడంటే


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Siricilla

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు