(K.Haribabu,News18, Rajanna siricilla)
మన ఊరు మనబడి పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ నివేదించారు. జనవరి 15లోగా వన్ని పనులను పూర్తి చేస్తామని జిల్లా అదనపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, సంచాలకులు దేవసేనలకు తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మన ఊరు- మన బడి పాఠశాల అభివృద్ధి పనులపై హైదరాబాదు నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, సంచాలకులు దేవసేన తదితర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
ఈ దృశ్య మాధ్యమ సమీక్షకు కలెక్టరేట్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ జిల్లా విద్యాధికారీ రాధా కిషన్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మన ఊరు మనబడి ప్రణాళిక అభివృద్ధి పనుల ప్రగతిని వివరించారు. జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద మొదటి విడతగా 13 మండలాలలో 172 పాఠశాలలను తీసుకోవడం జరిగిందని, మండలానికి రెండు చొప్పున 26 పాఠశాలలు మోడల్ స్కూల్ గా అభివృద్ధి పనులు చేయించడం జరుగుతుందన్నారు. జనవరి 15 నాటికి అన్ని పనులను పూర్తి చేస్తామని చెప్పారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన నుండి వచ్చిన ప్రతిష్టాత్మకమైన మన ఊరు మనబడి కార్యక్రమం అన్నారు. నిధులకు కొరత లేదని పాఠశాలలలో నాణ్యతమైన పనులు చేపట్టి క్రీడా ప్రాంగణంతో పాటు పాఠశాలను అన్ని సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దాలన్నారు. అవసరమైన చోట గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్ ఉండి తీరాలన్నారు. ప్రతి మండలానికి రెండు చొప్పున మోడల్ స్కూల్ గా అన్ని హంగులు ఫర్నిచర్, గ్రీన్ బోర్డ్ తో సహా అభివృద్ధి చేయాలన్నారు.
మిగతా పనులను యుద్ద ప్రాతిపదికన అభివృద్ధి చేయాలన్నారు. పాఠశాలల పరిశుభ్రత గ్రామ పంచాయతీ బాధ్యత తీసుకొని ఎలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. నిధులు సరిపడా ఉన్నాయని, పనులు పూర్తయిన వాటి బిల్లులు మంజూరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాధికారి రాధా కిషన్, సంబంధిత కార్యనిర్వహక ఇంజనీరు లు, ఉప కార్య నిర్వాహక ఇంజనీరు లు, FLA మండల నోడల్ అధికారులు పాల్గొన్నారు.
జనవరి 15 లోగా పనులను పూర్తి చేయాలని ఇంజనీర్ లకు జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అధికారులతో కలెక్టరెట్ లో సమావేశమయ్యారు. జిల్లాలో మొదటి విడత కింద ఎంపిక చేసిన 172 పాఠశాలల్లో ఇప్పటికే 12 కాంపోనెంట్లలో పనులు జరుగుతున్నాయని తెలిపారు. పనులను వేగవంతం చేసి వచ్చే జనవరి 15 కల్లా ప్రారంభానికి సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు హుకుం జారీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Siricilla, Telangana