(హరి, న్యూస్18 తెలుగు, సిరిసిల్ల)
మంత్రి కేటీఆర్ కు అరుదైన కానుకను ఇచ్చాడుఓ యువకుడు. చేపూరి సంతోష్ చారి అనే యువకుడు టేకు కర్రపై చిత్రించిన సీఎం కేసీఆర్ ప్రతిమను బహూకరించాడు. ప్రతిమను ఆసక్తిగా తిలకించిన మంత్రి కేటీఆర్ యువకున్ని అభినందించారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చేపూరి సంతోష్ చారి సీఎం కేసీఆర్ పైఉన్న అమితమైన అభిమానంతో ఆయన ప్రతిమను తయారు చేశాడు. స్వతహాగా వృత్తిరీత్యా వడ్రంగైన సంతోష్ చారి సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆకర్షితులైన సంతోష్, కేసీఆర్ ప్రతిమను తయారు చేయాలనేసంకల్పంతో, దాదాపు వారం నుండి పది రోజుల పాటు ఎంతో కష్టపడి సీఎం కేసీఆర్ ప్రతిమను తీర్చిదిద్దాడు. కేసీఆర్ ప్రతిమతో పాటు నాగలి, గొర్రు తయారు చేశాడు.
తాజాగా మంత్రి కేటీఆర్ గంభీరావుపేట మండలంలో కేజీ టు పీజీ క్యాంపస్ ప్రారంభానికి వచ్చారు. కేటీఆర్ వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న సంతోష్.. మంత్రిని కలిసి సీఎం కేసిఆర్ టేకు ప్రతిమను బహుకరించారు. ప్రతిమను ఆసక్తిగా తిలకించిన మంత్రి కేటీఆర్ సంతోష్ చారిని ప్రత్యేకంగా అభినందించారు.
సీఎం కేసీఆర్ అంటే తమకు ఎంతో ఇష్టమని, కాబోయే సీఎం మంత్రి కేటీఆర్ కు సీఎం ప్రతిమను ఇవ్వడం హ్యాపీగా ఉందని సంతోష్ తెలిపాడు. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం ప్రతిమ టేకు చెక్కపై రూపొందించడం గొప్పగా భావిస్తున్నానని అన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna sircilla, Telangana