K.Haribabu,News18, Rajanna siricilla
ప్రభుత్వ పాఠశాల సంబంధించిన క్రీడాస్థలం భూమి అన్యక్రాంతమవుతుందని గ్రామానికి చెందిన ప్రజలు ఏకదాటిపై నిలిచి నిరసన చేపట్టారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు.. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాల స్థలం కోసం గ్రామ ప్రజలందరూ.. కలిసి గతంలో సైతం కలెక్టర్ ఉన్నతాధికారులకు ప్రజావాణిలో వారి దృష్టికి తీసుకెళ్లామని వారు చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానాన్ని సైతం కొందరు కావాలని పట్టా చేయించుకున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురవుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,ఆర్డీవో,ఎమ్మార్వో తమ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళ్ళపల్లె గ్రామ ప్రజలు గురువారం రోజుననిరసనతెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు బాధినేని బాలరాజు, ఉప్పల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించిన రెవిన్యూ భూమి మూడు ఎకరాలు ఉందని, అది అన్యాక్రాంతమవుతుందని ఎన్నోసార్లు ఎమ్మార్వోతో (MRO) పాటు ప్రజావాణిలో కలెక్టర్ కు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా.. ఇంత వరకు ఎవరు కూడా స్పందించలేదని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని అన్యక్రాంతం కాకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మంగళ్ళపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిని ఆక్రమించి దానిని సాగు చేస్తున్నాడని, భూమి సాగు చేసుకునేందుకు ఎమ్మార్వో (MRO) తనకు పత్రాలు ఇచ్చాడని చెపుతున్నాడని, ఆ భూమికి సంబంధించిన విషయమై గ్రామానికి చెందిన 14 మందిపై కోర్టులో కేసు వేశాడని, అది విచారణ జరుగుతుండగా ఆ భూమిని దున్ని సాగు చేసేందుకు తుకం వేశాడని, ప్రభుత్వం తనకి భూమి ఇచ్చిందంటూన్నాడని, అధికారులు ఇకనైనా స్పందించి ఆ వ్యక్తికిఏ విధంగా భూమి ఇచ్చిందో చూపించాలని కోరారు.
OMG: నలుగురు కాదు 40 మంది ఎమ్మెల్యేలు..సిట్ నివేదికలో సంచలనాలు..లిస్ట్ లో మాజీ డిప్యూటీ సీఎం కూడా..
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించి ఆక్రమణకు గురవుతున్న తమ గ్రామ పాఠశాల భూమిని హద్దులు చూపించి కాపాడాలని అంటున్నారు గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు వెలిశాల నర్సయ్య, అవురం సురేష్ఉప్పుల నాగరాజు, ఉప్పుల మల్లయ్య, వెళిశాల లక్ష్మయ్య, బాదినేని శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana