Haribabu, News18, Rajanna Sircilla
ఆలయం అంటే నిత్యం భక్తులు వెళ్లే ప్రాంతం. అలాంటి చోట సౌకర్యాలు సక్రమంగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. దక్షిణకాశీగా, ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజీల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి (Vemulawada Temple) దత్తత దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పుణ్యక్షేత్రానికి, గుట్టపైకి వెళ్లే ఘాట్ రోడ్ కు ఇరువైపులా సైడ్ వాల్స్ కానీ, ఫెన్సింగ్ కానీ లేకపోవడంతో భక్తులు గతంలో ప్రమాదాలకు గురయ్యారు. ఘాట్ రోడ్ మూల మలుపుల వద్ద గతంలో ఏర్పాటు చేసిన సూచిక హెచ్చరిక బోర్డులు శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు ఘాట్ రోడ్డుకు ఇరువైపులా సైడ్ వాల్స్ కానీ, ఫెన్సింగ్ కానీ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. గతంలో సైతం భక్తులు ప్రమాదాలకు గురయ్యారు. సూచిక హెచ్చరిక బోర్డులు శిథిలావస్థకు చేరుకొని పడిపోయి ఉన్నాయని భక్తులు చెబుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar District) కేంద్రంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా నాంపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ పుణ్యక్షేత్రం ప్రసిద్ధి. భక్తులకు గుట్టపై సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, కోట్లల్లో ఆదాయం వస్తున్నా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనేవాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని భక్తుల ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా భక్తుడు మాట్లాడుతూ.. ఘాట్ రోడ్ పైనుంచి వస్తుండగా సూచిక హెచ్చరిక బోర్డులు కానరాలేవని, కొన్ని ప్రాంతాల్లో ఉన్న సూచిక హెచ్చరిక బోర్డులు సైతం నేలకు కోరిగి ఉన్నాయని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఘాట్ రోడ్డుకు ఇరువైపులా సేఫ్టీ ఏర్పాటు చేయాలని కోరారు. స్పీడ్ బ్రేకర్లు సైతం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు భక్తుడు రాజ్ కుమార్. కొన్ని కొన్నిచోట్ల ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ వారు బారికెట్లు ఏర్పాటు చేశారు. కానీ వాటి పర్యవేక్షణ లోపంతో నేలకూలి దర్శనమిస్తున్నాయనే చెప్పాలి.. నాంపల్లి గుట్ట ప్రాంతంలో సీసీ కెమెరాలు పర్యవేక్షణ సైతం పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ భక్తుల సంరక్షణకై, భద్రతకై ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు వేడుకుంటున్నారు.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గుట్టపై ఉన్న కాళీమర్దనం (నాగుపాము ప్రతిమ) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ నాగ ప్రతిమను మహారాష్ట్ర మాజీ గవర్నర్, బిజెపి సీనియర్ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు నిర్మించారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Vemulawada