హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: రహదారిని వెంటనే నిర్మించాలని తుల ఉమ పాదయాత్ర

Rajanna Siricilla: రహదారిని వెంటనే నిర్మించాలని తుల ఉమ పాదయాత్ర

X
పాదయాత్ర

పాదయాత్ర చేపట్టిన మాజీ జెడ్పీ చైర్మన్

RajannaSiricilla: మేడిపల్లి మండలం ప్రజలకు వేములవాడ నియోజకవర్గానికి రావడానికి దారి ఎక్కడ ఉందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్, బీజేపి రాష్ట్ర సీనియర్ నాయకురాలు తుల ఉమ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

K.Haribabu,News18, Rajanna siricilla

మేడిపల్లి మండలం ప్రజలకు వేములవాడ నియోజకవర్గానికి రావడానికి దారి ఎక్కడ ఉందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్, బీజేపి రాష్ట్ర సీనియర్ నాయకురాలు తుల ఉమ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి మండలం మోత్కురావుపేట నుండి చందుర్తి మండల కేంద్రానికి వెంటనే మద్యలో ఆగిపోయిన రోడ్ నిర్మాణపనులను ప్రారంభించాలని 11 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేములవాడ నియోజకవర్గంలో ఉన్న మేడిపల్లి నుండి నియోజకవర్గ కేంద్రానికి రావాలంటే దాదాపు 60 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుందని, తాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న సమయంలో 19 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మించాలని నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించినా అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఆమె విమర్శించారు.

కేవలం 11 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పేరుతో పాలకులు ఎన్నో వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తర్వాత మాట మార్చారని ఉమ ఆరోపించారు. వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని, లేనిపక్షంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆమె హెచ్చరించారు. జర్మన్ బాబు, స్థానిక ఎమ్మెల్యేకి కనీస బాధ్యత లేదనీ, సంవత్సరాలుగాకిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు తుల ఉమ. ఎమ్మెల్యే ఉంటే జర్మనీలో.. లేదంటే ఇక్కడికి వస్తే గడీలలో ఉంటాడన్నారు.

మేడిపల్లి ప్రజలు ఎన్నిసార్లు అడిగినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రజలకు అండగా ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. చందుర్తి మండల కేంద్రం నుంచి పసునూరు వరకు రోడ్డు సమస్య పరిష్కరించాలంటూ పాదయాత్ర చేసిన తరుణంలో పాదయాత్రలో పాల్గొనేందుకు బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎమ్మెల్యే రమేష్ బాబు స్పందించి చందుర్తి మోత్కరావుపేట రహదారిని నిర్మించి ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం చూపడం లేదంటూ మండిపడ్డారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి చందుర్తి మోత్కూరుపేట ప్రధాన రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరారు. తన సొంత ఊరైన మోత్కూర్రావుపేట ప్రాంతానికి ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న సమయంలోనే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు