K.Haribabu,News18, Rajanna siricilla
ఆరుగాలం కష్టించి పండించిన పంట పొలంపై మోగి పురుగు దాడి చేసి కాండం తోలచడంతో వరి పైరు మొత్తం తాలుగా మారింది. దీంతో నష్టమే మిగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ధర్నా దేవయ్య అనే రైతు రెండు ఎకరాలలో వరి పంట వేశాడు. వరి నారు ఎదిగి గోళక వేసే సమయానికి మొగి పురుగు దాడి చేసి మొక్క కాండం తోలచడంతో వరి ధాన్యం గట్టి పడక తప్ప మిగిలిందని ఆవేదన వ్యక్తంచేశాడు రైతు దేవయ్య..
ఈ సందర్భంగా రైతు దేవయ్య న్యూస్18తోమాట్లాడుతూ.. ఎంతో కష్టపడి పండించిన పంట మొగి పురుగు బారిన పడి తీవ్ర నష్టం మిగిల్చిందని వాపోయాడు. ఎప్పుడు లేని విధంగా 2 ఎకరాల పంట దెబ్బతిందని, ప్రస్తుతం కోతల సమయం కావడంతో హార్వెస్టర్ తో పంట కోపిద్దాం అనుకోని ప్రయత్నం చేశానని, కానీ అరా ఎకరానికి రెండు బస్తాల ధాన్యం రావడంతో హార్వెస్టర్ కి 2000లు ఇచ్చి నష్టపోవడం ఇష్టం లేక కోయడం నష్టమనిపించిందని రైతు దేవయ్య తెలిపాడు. కష్టపడి పండించిన వరి పంటను పశువులకు మేతగా వదిలేసానని ఆవేదన వ్యక్తంచేశాడు. తనలాగ నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ.. ఈ మొగి పురుగు సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని తెలిపారు. యాసంగి పంటకు కూడా మొగి పురుగు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున రైతులు ముందే జాగ్రత్త పడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అవగాహన సదస్సును నిర్వహిస్తూ.. పంట మార్పిడి తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. అనుకోకుండా పంటకు దిగుబడి నష్టాలు వస్తే ఎలా బయటపడాలో సైతం దిశా నిర్దేశం చేయాల్సిన అధికారులు చేయకపోవడంతోనే రైతులు అధికంగా నష్టాలు చవిచూస్తున్నారని తెలుస్తోంది.
ఏదైనాప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు వారు వేసే పంటలపై, వాటికి వచ్చే చీడపీడలను సైతం వివరిస్తూ ఏ సమయాల్లో ఏమి క్రిమిసంహారక మందులు వాడాలో సూచిస్తే బాగుంటుందని రైతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హార్వెస్టర్ కు గంటకు 2000 నుంచి 3000 వరకు ఖర్చవుతుందని, ఈ రెండు ఎకరాల పొలంలో ఆ మాత్రం కూడా డబ్బులు రావని గమనించిన రైతు పశువులకు మేతకు రెండు ఎకరాల పొలాన్ని వదిలినట్టు తెలిపాడు అంటే అర్థం చేసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana