K.Haribabu,News18, Rajanna siricilla
రాజన్న సిరిసిల్లకు దేశ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 కింద నవంబర్ మాసంలో 4 స్టార్ కేటగిరీలతో రాజన్నసిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
కేంద్ర ప్రభుత్వ తాగునీరు-పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ (డి.డి.డబ్ల్యుఎస్.) రాజన్న సిరిసిల్ల అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. అంతే కాకుండా..
వెల్ డన్ అంటూ అభినందిస్తూ డి.డి.డబ్ల్యుఎస్ అధికారిక ట్విట్టర్ హాండిల్ లో పోస్ట్ కూడా చేశారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023కింద నవంబర్ మాసంలో 4 స్టార్ కేటగిరీలతో రాజన్నసిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం దక్కడం పట్ల మంత్రి కే తారక రామారావు హర్షం వ్యక్తం చేసారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులకు అభినందలు అంటూ మంత్రి కే.తారక రామారావు ట్వీట్ చేసారు. ప్రతిగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మీ నిరంతర మార్గదర్శనం, సహకారం వాళ్ళే సాధ్యమైoదంటూ ప్రతి ట్వీట్ చేసారు.
స్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ) లో భాగంగా స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ 2023 నవంబర్ మాసంలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా దేశంలోనే జిల్లాకు 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. అన్ని గ్రామాలను ODF ప్లస్ కేటగిరిలో మోడల్ గ్రామాలుగా డిక్లర్ చేసినందుకు గాను దేశంలోనే రాజన్న సిరిసిల్ల మొదటి స్థానం దక్కించుకుంది.
ODF ప్లస్ మోడల్:-
1.గృహ స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించుకొని ఉపయోగించు కోవడం.
2.అన్ని ఇన్స్టిట్యూషన్ లోపల మరుగు దొడ్ల వినియోగం
3.గ్రామాలలో తడి పొడి చెత్త సక్రమ నిర్వహణ
4.కంపోస్ట్ షెడ్ల వినియోగం.
5.అన్ని గ్రామాలలో మురుగు నీటి నిర్వహణ
6.అన్ని గ్రామాలను పరిశుభ్ర గ్రామాలుగా తీర్చి దిద్దడం
7.ప్రతి గ్రామంలో పారిశ్యుధ్యానికి సంబందించిన వాల్ పెయింటింగ్స్ ఏర్పరచడం
ఈ అవార్డు మంత్రి KTRమార్గదర్శనంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సారధ్యంలో
జిల్లా అదనపు కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లా ముఖ్య కార్య నిర్వహణ అధికారి మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి గౌతం రెడ్డి, జిల్లా పంచాయతి అధికారి రవీందర్, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి మదన్ మోహన్, అన్ని మండలాల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులు, అన్ని మండలాల పంచాయతి అధికారులు, డివిసినల్ పంచాయతి అధికారి మల్లిఖార్జున్, స్వచ్చ భారత్ మిషన్ గ్రామీణ బృందం కే.సురేష్, మరియు బి.ప్రేం కుమార్ అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి ఫలితంగానే ఈ అవార్డు రావడం జరిగింది. ఇదే స్ఫూర్తితో పని చేయాలి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, శానిటరీ సిబ్బంది కృషి ఫలితమే..
భాగస్వామైన ప్రతి ఒక్కరికీ అభినందనలు:జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023కింద నవంబర్ మాసంలో 4 స్టార్ కేటగిరీలతో రాజన్నసిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం దక్కడం జిల్లాలోని మంత్రి శ్రీ కే తారక రామారావు మార్గదర్శనం, ప్రజా ప్రతినిధులు, అధికారుల కృషి ఫలితమేనని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, DRDO, DPO, ఎంపిడివోలు, ఎంపీఓలు, పంచాయితీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, టెక్నికల్ అసిస్టెంట్ లు, పారిశుధ్య సిబ్బంది, కార్మికులు అందరికీ జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాగా పనిచేసిన వారి సేవలను ప్రశంసిస్తూ..ప్రతి మండలంలో సెలెబ్రేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తూ స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ 2023లో అగ్రభాగాన నిలపాలని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana