K.Haribabu,News18, Rajanna siricilla
రహదారులు కోతకు గురై నెలలు గడుస్తున్నా మరమత్తులు చేయడం లేదు. దీంతో వాహన చోదకులు తరచూ ప్రమాదాల బారినపడున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. వారి ప్రాణ నష్టం జరగక ముందే మరమ్మత్తులు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిపాదనలతో సరి పెడ్తున్నారని ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు.
ముస్తాబాద్ మండలంలో భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి. చాలా గ్రామాల్లో కోతకు గురైన రహదారులకు మరమ్మతు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. జరిగిన నష్టాన్ని అంచనా వేసిన అధికారులు ప్రతిపాదనలతోనే సరిపెట్టారు. ముస్తాబాద్ మండలం గూడెం కొండాపూర్ గ్రామాల మధ్య ఉండే రహదారి దెబ్బతింది. బారీ వరదలతో కల్వర్టు మీద నుంచిగూడెం, కొండాపూర్ మధ్య కొట్టుకుపోయిన వెళ్లడంతో రహదారి కోతకు గురైంది.
రెండు గ్రామాల మధ్య మూల మలుపు వద్ద వున్న రహదారి కింద పెద్ద గొయ్యి పడింది. గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనగా కొంచెం ముట్టి పోసి చేతులును దులుపుకున్నారని గూడెం వాసులు ఆరోపిస్తున్నారు. శాశ్వత మరమ్మతు పనులు చేయాలని కోకుతున్నారు. అవునూర్,రామలక్ష్మణపల్లె గ్రామాల మధ్య రహదారి తరచూ వర్షాలకు కోతకు గురవుతూనే వుంది.
ప్రతిపాదనలకు మోక్షం ఎప్పుడు!?
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంముస్తాబాద్ మండలంలోని పలు సింగిల్ లైన్ రోడ్లను ఆర్అండ్బి, పంచాయతీ రాజ్ అధికారులుడబుల్ రోడ్డుగా మార్చే ప్రక్రియకు మోక్షం లభించడంలేదని మండల ప్రజలు తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముస్తాబాద్, దుబ్బాక రహదారి ప్రమాదకరంగా ఉంది. దీనికి నిధులు మంజూరయ్యాయని, ఏడాదిగాచేస్తున్నా పనులు మొదలు కావడం లేదు. అలాగే రామలక్ష్మణపల్లె, తేర్లమద్ది, తండా పనులకు ప్రతిపాదనలు పెండింగ్ లోనే ఉన్నాయి. వచ్చే బడ్జెట్ నాటికైన నిధులు మంజూరై..పనులు ప్రారంభిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. అధికారుల ప్రతిపాదనలు ఈసారైన కార్యరూపం దాల్చాలని ప్రజలు కోరుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డుకు నిధులు మంజూరు చేసి కోతకు గురైన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ఉన్నతాధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలని వాహనదారులు ప్రజలు వేడుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలోనే ఇలాంటి దుస్థితి ఉండడం బాధాకరమని వాహనదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయిలో కోతలకు గురైన రోడ్లను సందర్శించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana