హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: ఘనంగా ముగిసిన రాజరాజేశ్వర స్వామి గీతా జయంతి ఉత్సవాలు

Rajanna Siricilla: ఘనంగా ముగిసిన రాజరాజేశ్వర స్వామి గీతా జయంతి ఉత్సవాలు

X
ముగిసిన

ముగిసిన స్వామి వారి ఉత్సవాలు

Telangana: శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న గీతా జయంతి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిసాయి.ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ స్థానాచార్యులు భీమా శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహిం

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

K.Haribabu,News18, Rajanna siricilla

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న గీతా జయంతి ఉత్సవాలు పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి రోజూ ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమా శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు.

గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా నాగిరెడ్డి మండపంలో హోమం చేశారు. సంస్కృత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు భగవద్గీత పారాయణం చేశారు. అనంతరం పూర్ణాహుతితో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ప్రతి సంవత్సరం గీతా జయంతి ఉత్సవాలు మూడురోజుల పాటు గీతా జయంతి నిర్వహిస్తారు. పరివార దేవతలతో పాటు అనుబంధ ఆలయాల్లో సైతం అభిషేక పూజలు, దేవతార్చనలు గావించారు.

ఆలయ ధర్మ గుండాన్ని సైతం అధికారులు పునః ప్రారంభించడంతో భక్తులు అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ గుండంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి సేవలో తరించారు. స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి వారి దర్శనార్థం గంటల తరబడి క్యూలైన్ లో భక్తులు వేచి చూశారు.

భక్తుల దాహార్తి తీర్చేందుకు ఆలయ అధికారులు క్యూలైన్ వద్ద మంచినీటిని ఏర్పాటు చేశారు. భక్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ పుష్కరిణీలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారి సేవల్లో భక్తులు తరిస్తున్నారు. కోడె మొక్కులు అనేది రాజన్న ఆలయ ప్రత్యేకత అనే చెప్పాలి. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా, పేదల పెన్నిధిగా, భక్తులందరూ నోరార పిలుచుకునే రాజన్నగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు ప్రసిద్ధి.

వేములవాడ పుణ్యక్షేత్రాన్ని.. హరిహర క్షేత్రం, భాస్కర క్షేత్రం అని కూడా భక్తులు పిలుస్తుంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రితో పాటు సీతారాముల కళ్యాణం, శివ కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్వామివారికి బంగారం(బెల్లం) తులాభారం సైతం... సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. వేములవాడ రాజన్న ఆలయంలోని మూలవిరాట్కు ప్రతిరోజు వేములవాడ పట్టణానికి చెందిన స్థానిక భక్తులు అభిషేకాలు చేస్తుంటారు.

ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడనే విషయం అందరికి తెలిసిందే. స్వామివారికి అభిషేకం నిర్వహిస్తే సర్వ రోగాలతో పాటు గండాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాజరాజేశ్వర స్వామి వారిని పూజిస్తే రాజయోగం వస్తుందని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో భక్తులు అలరారుతున్నారు స్వామివారి కృపాకటాక్షాలతో...ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ తిరుపతి రావు,ఆలయ ఇన్స్పెక్టర్ అశోక్,ఆలయ అర్చకులు,సిబ్బంది పాల్గొన్నారు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు