హోమ్ /వార్తలు /తెలంగాణ /

రైతుల భలే తెలివి.., పంటచేలోకి అడవి పందులు, పక్షులు రాకుండా ఏం చేశారో చూడండి

రైతుల భలే తెలివి.., పంటచేలోకి అడవి పందులు, పక్షులు రాకుండా ఏం చేశారో చూడండి

రాజన్న

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల వినూత్న ప్రయోగం

Farmers: ఒకప్పుడు రైతులు పొలం మధ్యలో దిష్టిబొమ్మలను బెదురుగా పెట్టేవారు. మరీ ఎక్కువ సాగు ఉంటే రైతులు మంచె కట్టుకుని రోజంతా పంటకు కాపలా ఉండేవారు. కానీ..ఇప్పుడున్న టెక్నాలజీని కొందరు రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  Haribabu, News18, Rajanna Sircilla

  అడవి జంతువుల (Wild Animals) నుంచి పశుపక్షాదుల నుంచి జొన్న, మొక్క జొన్న వంటి పంటలను రక్షించుకునేందుకు ఒకప్పుడు రైతులు పొలం మధ్యలో దిష్టిబొమ్మలను బెదురుగా పెట్టేవారు. మరీ ఎక్కువ సాగు ఉంటే రైతులు మంచె కట్టుకుని రోజంతా పంటకు కాపలా ఉండేవారు. కానీ..ఇప్పుడున్న టెక్నాలజీని కొందరు రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. పంటల సంరక్షణకు వినూత్నమైన ఆలోచన చేశారు. తెలంగాణ (Telangana) లోని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) బోయినిపల్లి మండలం రామన్నపేట గ్రామంలోని రైతులు తాము పండించిన వరి, జొన్న, మొక్కజొన్న వంటి పంటల రక్షణకు వినూత్నమైన ఆలోచన చేశారు. మొక్క జొన్న, జొన్న కోతకు వచ్చే సమయంలో అడవి పందులు, పక్షులు, జంతువులు పంటలను ధ్వంసం చేస్తుండటంతో రైతులు పంటను రక్షించేందుకు సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసి పగలు, రాత్రి కాపాడుకుంటున్నారు.

  గతంలో పంటను కాపాడటం కోసం రైతులు పొలం వద్దనే రాత్రి పగలు ఉంటూ..డప్పులు, గిన్నెలతో పెద్ద శబ్దాలు చేస్తూ పంటను కాపాడే వారు. ఏనుగులు, అడవి పందులు వంటి జంతువులను తరిమేందుకు టపాకాయలు కాల్చేవారు. కానీ ఇప్పుడు రైతులు వినూత్న ఆలోచనతో పంటలను రక్షించుకుంటున్నారు.

  ఇది చదవండి: మావోల లిస్టులో ఆ ఎమ్మేల్యే..? టార్గెట్ ఫిక్స్ చేశారా..? పోలీసుల తనిఖీలు అందుకేనా..!

  పంటకు కాపలాగా మనుషులు అవసరం లేకుండా, మెమరీ కార్డులో మనుషులు చేసే వివిద ఆహకరాలను రికార్డ్ చేసి పంటల వద్ద పెద్ద స్పీకర్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పక్షుల బెడదతో పాటు అడవి పందుల బెడద కూడా తగ్గిందని రైతులు అంటున్నారు. ఈ స్పీకర్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు గంటల పాటు శబ్దాలు చేస్తుందని, డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టి కూడా నడిపిస్తున్నామని రైతులు చెబుతున్నారు. 2 ఎకరాల చేనుకు రెండు, 4 ఎకరాలకు 6 సౌండ్ సిస్టమ్‌లు ఉపయోగిస్తున్నామని రామన్నపేట రైతులు చెప్పారు.

  ఇది చదవండి: బావి నీరే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చే అమృతం.., కానీ రోడ్డు వేసిన అధికారులు చేసిన పనికి

  పంట సంరక్షణ కోసం రైతులు చేసిన వినూత్న ఆలోచనతో పంటలను కాపాడుకోవడంతో పాటు, కూలీల అవసరం లేకుండా ఉంటుందని వివరించారు. జంతువులు, పశుపక్షాదుల కారణంగా గతంలో అధిక మొత్తంలో పంటలు ధ్వంసమైన ఘటనలు కోకోల్లలు అని రైతులు చెబుతున్నారు.

  ఒక్కో మైక్‌ కు రూ. 800/- వరకు ఖర్చయిందని రైతు చెబుతున్నాడు. రామచిలుకల బెడద మొక్కజొన్న జొన్న పంటలపై అధికంగా ఉండడంతో సౌండ్ సిస్టం ద్వారా చిలకల బెడదను అరికట్టినట్లు రైతులు వివరించారు. పంటను కాపాడేందుకు కూలీలకు అయ్యే ఖర్చు కంటే.. సౌండ్ సిస్టం ఏర్పాటు చేసుకునేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉందని తెలిపారు. వివిధ రకాల శబ్దాలతో మెమొరీ కార్డులో సాంగ్స్ రికార్డు చేసి పంట పొలాల వద్ద వాటిని టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో జంతువులు, పక్షులు పంట వైపు రావడానికి జంకుతున్నాయని రైతులు చెబుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Karimangar, Local News, Telangana

  ఉత్తమ కథలు