(K.Haribabu,News18, Rajanna siricilla)
స్వయం ఉపాధితో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతూ వ్యాపారంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువ దంపతులు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణ హితంగా ఉండేలా చక్కటి ఆలోచనలకు శ్రీకారం చుట్టి వ్యాపారంలో రాణిస్తున్నారు. "మన సంప్రదాయం - మన ఆరోగ్యం" అనే లక్ష్యంతో స్వచ్ఛతమైన విస్తరాకు ప్లేట్లను తయారు చేస్తూ తమతో పాటు మరో నలుగురికి ఉపాధి చూపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి కూడా స్వయం కృషితో ఎదగాలన్న సంకల్పంతో ప్రైవేటు ఉద్యోగాలను వదులుకుని విస్తరాకు ప్లేట్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేలా అవగాహన పెంచుతూ ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితంగా విస్తరాకుల ప్లేట్ల తయారీ చేసి కాలుష్య నియంత్రణలో భాగస్వాములవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రకృతి సిద్ధమైన ఆకు విస్తరి ప్లేట్ల తయారీతో స్వయం ఉపాధి పొందుతున్న యువ దంపతులపైన్యూస్18 స్పెషల్ స్టోరీ మీకోసం అందిస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రగతి నగర్ కు చెందిన అయిట్ల మనోజ్ కుమార్, నిత్యశ్రీ దంపతులు ఏడాది క్రితం ప్రకృతి సిద్దమైన విస్తరాకు ప్లేట్లను తయారు చేసే పరిశ్రమను ప్రారంభించారు. ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తూ పర్యావరణ హితంగా ఉండేలా ఈ వ్యాపారంలో ముందుకు సాగుతున్నారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. తద్వారా విస్తరాకు ప్లేట్ల వాడకాన్ని పెంచేలా చేస్తూ తమ వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తున్నారు.
ప్రజల్లో అవగాహన లేక ప్రారంభంలో కొంత ఇబ్బంది పడ్డామని, ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను ప్రచారం చేయడం వల్ల సహజ సిద్దమైన వాటిపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని మనోజ్ కుమార్, నిత్యశ్రీ దంపతులు పేర్కొంటున్నారు. రూ. 4 లక్షల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. మున్ముందు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొంది మరింత ముందుకు తీసుకెళ్తామంటు వారు చెబుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలను వదులుకొని ఉపాధిని ఎంచుకున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, మన సాంప్రదాయం - మన ఆరోగ్యమే లక్ష్యంగా ఈ విస్తరి ప్లేట్స్ తయారు చేస్తున్నారు.
బిజినెస్ చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ దంపతులు. స్వయం ఉపాధి పొందుతూ తద్వారా నలుగురు ఉపాధి అందించడం గర్వంగా ఉందన్నారు. ఎవరికైనా ప్రకృతిద్దమైన ప్లేట్స్ కావాలంటే తమను సంప్రదించాలని తమది ఎక్కడో కాదు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని ప్రగతి నగర్ అని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana