రోడ్డుపై కంకర పోశారు.. రోడ్డంతా తమదేనన్నట్లు ఎక్కడ చూసినా కంకర తప్ప ఏమీ లేదు.. కనీసం వార్నింగ్ బోర్టు కూడా పెట్టలేదు.. పగలంటే ఎలాగోలా రోడ్డు కనిపిస్తుందిలే.. ఏమీ కాదులే అనుకుందాం.. మరి రాత్రి అయితే పరిస్థితేంటి..? కిందపడి గాయాలు పాలవ్వల్సిందేనా? మనం చేయని తప్పుకు ఆస్పత్రులపాలవ్వల్సిందేనా..? ఎందుకీ నిర్లక్ష్యం.. కంకర పోసినోళ్లు.. ఒక వార్నింగ్ సైన్ బోర్డు పెడితే సొమ్మేం పోతుంది..? అలా చేస్తే ఆస్తులేమైనా కరిగిపోతాయా ఏం..?
కోరుట్ల - వేములవడ ప్రధాన రహదారిలో ఉన్న రుద్రంగి నాగరం చెరువు కాలువ బ్రిడ్జి వద్ద రోడ్డు పనులు జరుగుతున్నాయి. కల్వర్టు వద్ద రోడ్డును తవ్వి కంకర పోశారు. కనీసం కంకర పోసిన చోట కాంట్రాక్టర్ ఎలాంటి సూచిక హెచ్చరిక, బోర్డులు లేదా లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో పలు ద్విచక్ర వాహనాలు అదుపు తప్పుతున్నాయి. కంకర రోడ్డు కింద పడి వాహనదారులకు గాయాలవుతున్నాయి. అలాగే ఒక కారు, ఆటో కంకరలో ఇరుక్కుపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్ వెంటనే స్పందించి రోడ్డు వేయాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు. రోడ్డు వేయడం మంచిపని కానీ, ఎలాంటి హెచ్చరిక.. సూచిక బోర్డులు లేకుండా ప్రధాన రహదారిపై పనులు చేయడంతో ప్రయాణికులం చాలా ఇబ్బంది పడుతున్నామని వెంటనే R&B అధికారులు లేదా కాంట్రాక్టర్ స్పందించి కల్వర్టు వద్ద లైటింగ్ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి రోడ్డు పనులు కొనసాగించాలని కోరుతున్నారు.
ప్రమాదాల నివారణకు కృషి చేయాల్సిన అధికారులే .. రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా సూచిక హెచ్చరిక బోర్డ్స్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఆ ప్రాంతం ప్రమాదాలకు నేలువుగా మారుతుందని, వెంటనే అధికారులు కాంట్రాక్టర్ స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని ప్రయాణికులు,వాహనదారులు కోరుతున్నారు. చీకటి పడిందంటే చాలు ఆ ప్రాంతం నుంచి వాహనదారులు ప్రయాణించాలంటే జంకుతున్నారనే చెప్పాలి. కోరుట్ల ప్రాంతం నుంచి ప్రతిరోజు అధిక సంఖ్యలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. ఈ రోడ్డు, కల్వర్టు నిర్మాణ దశలో అధిక మొత్తంలో రోడ్డుపై కంకర పోయడంతో రహదారిపై వాహనాలు ఎలాంటి సూచిక హెచ్చరిక లైటింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని రాత్రి సమయాల్లో అయితే అధిక మొత్తంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు.
అధిక మొత్తంలో కంకర ఉండడంతో వాహనాలు సరిగా నడవక కంకరలో ఇరుక్కుపోతున్నాయి. దీంతో వాహనదారులు ప్రయాణికులు కలిసి ఆ కంకరలో ఇరుక్కుపోయిన వాహనాలను బయటికి తీస్తూ ఇబ్బందులు ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగాయని, రాత్రి సమయంలో అయితే భారీ నుంచి అతిభారీ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టాల్సినట్లు కనిపిస్తుందని ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Road accidents