K.Haribabu,News18, Rajanna siricilla
కంటిచూపు మందగించిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం మెరుగైనా వైద్య సేవలందించేందుకు కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం మనందరికీ తెలిసిందే.నిరుపేదలకు కంటిచూపు తిరిగి తీసుకు వచ్చేందుకు క్యాంపులు నిర్వహిస్తూ...పరీక్షలు చేసి, అవసరమైనా వాళ్లకు కళ్లద్దాలు అందజేయడంతో పాటు పూర్తిగా చూపుమందగించిన వారికి శస్త్ర చికిత్సలు చేయించేందుకు చర్యలు చేపట్టిందిప్రభుత్వం.
మొదటి విడుతలో ఆశించినంతగా బాధితులకు సేవలు అందించకుండానే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముగించింది. తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సన్నహాలు చేస్తుంది సర్కార్.. 2018 ఆగష్టు నెలలో తెలంగాణ ప్రభుత్వం తొలిసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. పల్లె, పట్టణాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడంతో పరీక్షలు చేయించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు.
Read This : Kakinada : చిన్న నిర్లక్ష్యం ఊరు మొత్తాన్ని ముంచేసింది .. చాప కింద నీరులా గ్రామాల్ని చుట్టేస్తోంది
చూపు లోపం ఉన్న వారికి అక్కడే కళ్ల అద్దాలను అందజేశారు. శస్త్ర చికిత్సలు అవసరమున్న వారికి చేయిస్తామని చెప్పి,బాధితులకు ఆపరేషన్లు చేయించే దిశగా చర్యలు తీసుకోలేదని అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి..అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటికి సంబంధించిన పరికరాలు,మందులు,కళ్ల అద్దాలు లాంటివి పంపిణీ చేయలేదు. కోనరావుపేట మండలంలో 28 గ్రామాలుండగా గతంలో 41 వేల జనభా ఉండగా,అందులో 23 వేల మందికి కంటి చూపు పరీక్షలు నిర్వహించారు.
మండలంలో 150 రోజులు ఆయా గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి, పరీక్షలు చేసినప్పటికి, కొందరికి కళ్ల అద్దాలు ఇవ్వలేదు. అందులో మండల వ్యాప్తంగా 475 మందికి కళ్ల అద్దాలు ఇవ్వాల్సి ఉండగా,ఆపరేషన్ అవసరమున్న వారు 900 మంది ఉండగా,వారికి ఇప్పటి వరకు ఎలాంటి వైద్య సేవలు అందలేదు.దీంతో మండలంలో మొదటి కంటి వెలుగు కార్యక్రమం కాస్త కంటి తుడుపుగానే సాగింది. వచ్చే యేడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తామనేసరికి పెదల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఉచిత పరీక్షతో పాటు కంటి అద్దాలు పంపిణీ చేయడంతో ఆర్థికంగా ఎంతో భరోసా కలుగుతుందని ఎదురుచూస్తున్నారు.అదేవిధంగా గతంలో ఆపరేషన్ అవసరమున్న వారికి హైదరాబాద్ ,వరంగల్ ప్రాంతాలకు తీసుకవెళ్లిందుకు వీలుకాకపోవడంతో జిల్లా కేంద్రంలోనే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి అందుబాటులో ఉండడంతో ఇక్కడే ఆపరేషన్లు ప్రక్రియ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇసారైనా కంటి వెలుగు కార్యక్రమం పేదల కళ్లకు వెలుగు నిస్తుందా అనే అనుమానాలు స్థానికుల్లో కలుగుతుంది. దానిని పూర్తిగా తీసివేసేలా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.
పక్కాగా నిర్వహించేందుకు సన్నహాలు: జిల్లా వైద్యధికారి సుమన్మోహన్ రావు...రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించేందుకు పక్కాగా సన్నహాలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు క్యాంపులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలు రావడంతోనే కార్యక్రమం పక్కాగా అమలు అయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News