హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajannasiricilla District: తొలిమెట్టు కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం

Rajannasiricilla District: తొలిమెట్టు కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం

తొలిమెట్టు కార్యక్రమం

తొలిమెట్టు కార్యక్రమం

Rajanna District: కరోనా సమయంలో రెండేళ్లు విద్య వ్యవస్థ గాడిదప్పింది.ఆ సమయంలో విద్యార్థుల సామర్థ్యం కాస్త తగ్గిపోవడంతో తిరిగి విద్యార్థుల్లో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

కరోనా సమయంలో రెండేళ్లు విద్య వ్యవస్థ గాడిదప్పింది. ఆ సమయంలో విద్యార్థుల సామర్థ్యం కాస్త తగ్గిపోవడంతో తిరిగి విద్యార్థుల్లో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పుడు ఇప్పుడే పాఠశాలలు సక్రమంగా నడుస్తుండడంతో విద్యార్థులకు నాణ్యమైనా విద్యతో పాటు చదువు పట్ల పట్టు సాధించేందుకు ప్రభుత్వం చర్యలకు పూనుకుంది.ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ఒకటవో తరగతి నుంచి ఏడవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించింది.అందులో భాగంగా ప్రభుత్వం ఫౌండేషన్ లిటరీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్) ఆధ్వర్యంలో తొలిమెట్టు కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ఆగష్టు 15 నుంచి ప్రారంభం కాగా,మొదటి విడత పూర్తి చేసుకుంది.

కోనరావుపేట మండలంలో 33 ప్రాథమిక పాఠశాలలు ఉండగా,4 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో తిరిగి విద్యార్థులకు పూర్వవైభం తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం మండలానికి ఒకరిని నోడల్ అధికారిగా నియమించింది. అధికారి పర్యవేక్షణలో నలుగురు ఆర్పీలు పనిచేస్తారు.ఈ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచెందుకు ఇప్పటికే పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న హెచ్ఎం,ఎస్టీలు,స్కూల్ అసిస్టెంట్లకు మూడు విడతలుగా ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. దీంతో విద్యార్థుల్లో భాష పరిజ్ఞానం, గణిత శాస్త్రంలో కూడికలు, తీసివేతలు,గుణకారాలు, భాగహారంపై మరింత పట్టు సాధించేందుకు పక్కా ప్రణాళిలతో విద్య బోధన చేస్తుంటారు.

విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేందుకు ప్రత్యేక ప్రశ్న పత్రం సైతం తయారు చేసింది. విద్యార్థుల ప్రగతిని ప్రతి రోజు కోఆర్డినేటర్ పర్యవేక్షిస్తుంటారు. విద్యార్థులు సాధించిన ప్రగతిని ప్రత్యేక యాప్ ద్వారా ఆన్లైన్లో జిల్లా కమిటికి నివేధికలు పంపుతున్నారు. కాని ప్రభుత్వం ఆశించిన రీతిలో కార్యక్రమం ముందుకు సాగుతుందా? లేకగతంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాల మాదిరిగా నీరుగారిపోతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గతంలో త్రీ ఆర్ట్, ఏబీసీ పేరుతో ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి చేసింది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు.

దీంతో రెండేళ్ల పాటు కరోనాతో విద్యా వ్యవస్థ కాస్త కుంటు పడడంతో ఈ కార్యక్రమాలు కాస్త నీరుగారిపోయాయి.ఈ కార్యక్రమం ద్వారా విద్యలో వెనుబడిన విద్యార్థులను గుర్తించి, వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించి,మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. తొలిమెట్టు పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు నిత్యం పర్యవేక్షణలో ఉండి, ఉపాధ్యాయులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే,ఆశించిన ఫలితాలు వస్తాయని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఏదిఏమైనా తొలిమెట్టు కార్యక్రమమైనా విజయవంతం కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పకడ్బందీగా అమలు: కోనరావుపేట మండల నోడల్ అధికారి శారద

తొలిమెట్టు మండలంలో తొలిమెట్టు కార్యక్రమంను పకడ్బదీగా అమలు చేస్తున్నామని విద్యార్థులకురాయడం,చదవడం లాంటివి పూర్తి స్థాయిలో వచ్చే విధంగా వారినంతా గ్రూప్లుగా తయారు చేసి, విద్యాబోధన సాగిస్తామనన్నారు. ప్రతి రోజు విద్యార్థులు ప్రతిభ ఏవిధంగా ఉందని పర్యవేక్షణ చేస్తున్నామని, విద్యార్థుల్లో చదవడం,రాయడం కదలిక వచ్చింది. మరింతా మెరుగైనా విద్యను విద్యార్థులు వంద శాతం సాధించే పూర్తి స్థాయిలో కష్టపడుతున్నామని వివరించారు. ప్రతి నెల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి, విద్యార్థులకు బోధన పద్ధతులపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రతి నెల మండలంలోని యాభై శాతం పాఠశాలలను పర్యవేక్షించడంతో పాటు ప్రగతి నివేధికలను జిల్లా కమిటీకి అప్పగించడం జరుగుతుంది.గతంలో కంటే ఇప్పుడు విద్యార్థుల నుంచి మెరుగైనా ఫలితాలు వస్తున్నాయి, ఉపాధ్యాయులు సైతం అదే తరహాలో విద్యా బోధన సాగించడంతో ఈ కార్యక్రమం విజయంతంగా ముందు సాగుతుంది.దీనిపై జిల్లా కలెక్టర్, డీఈవోలు ప్రత్యేక దృష్టి సారించారు.వారి ఆదేశాల మేరకు ఆశినంతంగా తొలిమెట్టు కార్యక్రమం సాగుతోంది.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు