హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: ఉద్యమంలా చిరుధాన్యాలపై చిన్నారుల్లో అవగాహన.., ముందుండి నడిపిస్తున్న కలెక్టర్ 

Rajanna Siricilla: ఉద్యమంలా చిరుధాన్యాలపై చిన్నారుల్లో అవగాహన.., ముందుండి నడిపిస్తున్న కలెక్టర్ 

చిరుధాన్యాలపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రచారం

చిరుధాన్యాలపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రచారం

ఉద్యమ స్ఫూర్తితో చిరుధాన్యాల ప్రాధాన్యత ప్రతి గడపకూ చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District collector) కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  Haribabu, News18, Rajanna Sircilla

  ఉద్యమ స్ఫూర్తితో చిరుధాన్యాల ప్రాధాన్యత ప్రతి గడపకూ చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District collector) కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. చిరుధాన్యాలు, పౌష్టికాహారంపై గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు ఆరోగ్యానికి చిరుధాన్యాలు ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు. ఇటీవల సిరిసిల్ల పట్టణంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినిలతో నిర్వహించిన మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్పీ చైర్ పర్సన్ అరుణ, ఎమ్మెల్యే రమేష్ బాబు ఇతర అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  చిరుధాన్యాలతో విద్యార్థిని తయారుచేసిన పలు వంటకాలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ అరుణ మాట్లాడుతూ చిరుధాన్యాలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని అన్నారు. చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు మంత్రి కే.తారక రామారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

  ఇది చదవండి: ఇకపై ఆర్టీసీ బస్సులో కండక్టర్ కనిపించడేమో.., కారణం ఇదే..!

  విద్యార్థులు స్వయంగా తయారుచేసిన వంటకాలతో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల లైఫ్ టైం రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు. దేశంలో యువత, ముఖ్యంగా యువతులు, బాలికలు ఎనీమియా బారిన పడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. తినే ఆహారంలో సమతుల్యతను పాటించడం ద్వారా జీవితకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చునని చెప్పారు.

  ఇది చదవండి: కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము చెదల పాలు.., వృద్ధ దంపతులకు తీరని కష్టం

  ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ.. పోషకాహారం తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేందుకే కేంద్ర ప్రభుత్వం 2018లో పోషణ అభియాన్ శ్రీకారం చుట్టిందనీ అన్నారు. చిన్నారుల్లో మిల్లెట్ ఫుడ్ ప్రాముఖ్యత తెలియజేస్తూ ఆదిశగా సానుకూల మార్పులు రావడం గొప్ప విషయమని అన్నారు. జిల్లా కేంద్రాలలో మాదిరే అన్ని మండల కేంద్రాలలో కూడ వీటిని నిర్వహించాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, జెడ్పీ చైర్ పర్సన్ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ లో 15 పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లను పరిశీలించారు. అక్కడి మిల్లెట్ వంటకాలను రుచిచూశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Karimangar, Local News, Telangana

  ఉత్తమ కథలు