K.Haribabu,News18, Rajanna siricilla
ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దిన చేపూరి సంతోష్ చారి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చేపూరి సంతోష్ చారి సీఎం కేసీఆర్ పై అభిమానంతోకేసీఆర్ ప్రతిమను తయారు చేశాడు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వృత్తిరీత్యా వడ్రంగి అయిన సంతోష్ చారి.. సీఎం చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులై, కేసీఆర్ ప్రతిమను తయారు చేయాలనే సంకల్పంతో, దాదాపు వారం నుండి పది రోజులు కష్టపడి, సమయం దొరికినప్పుడల్లా సీఎం కేసీఆర్ ప్రతిమను తీర్చిదిద్దాడు. కేసీఆర్ ప్రతిమతో పాటు నాగలి, గొర్రు తయారు చేశాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వడ్రంగులను ఆదుకోవాలని సూచించారు. అవకాశం ఇస్తే ముఖ్యమంత్రికి నేరుగాఅందిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Read Also : YS Sharmila: వైఎస్ షర్మిలను పరామర్శించేందుకు జగన్ వస్తున్నారా ?.. విజయమ్మ ఏమన్నారంటే..
వడ్రంగి కళాకారుడు సంతోష్ చారి మాట్లాడుతూ.. సీఎం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేస్తూ..ఆదర్శంగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ మీద మక్కువతో స్ఫూర్తి పొంది సీఎం కేసిఆర్ బొమ్మ చెక్కడం హ్యాపీగా ఉందని అన్నారు. అవకాశం కల్పిస్తే సీఎం కేసీఆర్ కు స్వయంగా అందజేయాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. సీఎం కేసీఆర్ నేతృతంలో బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు.
వడ్రంగి కళా నైపుణ్యం టేకు కర్రపై సీఎం కేసీఆర్ చిత్రం వెయ్యడం హ్యాపీగా ఉందని, తాను పడ్డ శ్రమకు తగిన ఫలితం లభించిందని.. స్వయంగా సీఎం కేసీఆర్ కు ఇచ్చే అవకాశం కల్పించాలని కోరుకున్నాడు సంతోష్ చారి. సీఎం కేసీఆర్ పాలన స్ఫూర్తి దాయకమని అన్నారు. సంతోష్ చేసిన పనిముట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు, పట్టణ యువకులు సంతోష్ చారిని అభినందిస్తున్నారు. సమాజంలో చైతన్యం కల్పిస్తున్న గొప్ప గొప్ప వ్యక్తుల ప్రతిమలు చెక్కపై చెక్కే అలవాటు చేస్తున్నట్లు తెలిపాడు. అనేక మంది స్ఫూర్తి దాతల ప్రతిమలు గిస్తానని పేర్కొన్నాడు. వృతి రీత్యా వడ్రంగి నేపథ్యంలో బొమ్మలు ప్రతిమలు గియ్యడం సులువుగా మారింది.
ఈ సందర్భంలో సంతోష్ చారి..చిన్న చిన్న చెక్క ముక్కలతో అనేక రకాల వ్యవసాయ పనిముట్లు తయారు చేశాడు. ఈ పనిముట్లు అందరిని అబ్బురపరుస్తున్నాయి. ఎందరో మహనీయుల ప్రతిమలు సైతం రూపొందించాలని ఉందని పేర్కొన్నాడు. కళా నైపుణ్యంతో సంతోష్ అందరి మన్ననలు పొందుతున్నాడు. సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వడ్రంగి వృత్తిరీత్యా అయిన సంతోష్.. సీఎం కేసీఆర్ ప్రతిమను టేకు చెక్క పై సర్వాంగ సుందరంగా చేక్కడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kcr, Local News, R, Telangana