హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆవేదనలో రైతన్నలు.. వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలు..

ఆవేదనలో రైతన్నలు.. వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలు..

X
వర్షానికి

వర్షానికి దెబ్బతిన్న పంటలు

Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి, చందుర్తి మండల కేంద్రాలతో పాటు పలు మండలాల్లో దాదాపు అరగంట పాటు కురిసిన వడగండ్ల వానకు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి, చందుర్తి మండల కేంద్రాలతో పాటు పలు మండలాల్లో దాదాపు అరగంట పాటు కురిసిన వడగండ్ల వానకు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్పార్టీ నాయకులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చూస్తే..రైతుల కష్టం గుర్తుకు వస్తుందని అన్నారు.

ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం రాళ్ళపాలు అయిందని అన్నారు.నువ్వు పంట,మామిడి,జామ,కూరగాయల తోటలు,వరిపైరు ఇలా రాళ్ళ వర్షానికి అన్ని పంటలు దెబ్బతిని రైతులకు తీరని నష్టమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు..తక్షణమే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన పంటపొలాలను గుర్తించి ప్రభుత్వం తరపున రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఎవరు అధైర్యపడవద్దని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వచ్చేంతవరకు అధికార బిఆర్ఎస్ పార్టీపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. అయినా అధికార పార్టీ రైతులకు అన్యాయం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న సమయంలో రైతులకు అన్ని రకాలుగా వైయస్సార్ అండగా ఆపన్న హస్తము అందించారని గుర్తు చేశారు.

రైతుల కోసం రుణమాఫీ, అన్ని రకాల సబ్సిడీలు అందించాలని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వరి పంట పొలాలు (గొలక) వచ్చిన వరి పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అధికార పార్టీలు (BJP,BRS) త్వరితగతిన స్పందించి నష్టపోయిన రైతులు ఆదుకోవాలని కోరారు.

ఈ అకాల వర్షంతో జిల్లా ప్రజల సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వడగండ్ల వానతో పంట పొలాలను జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు భరోసా కల్పించేందుకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

రైతుల కోసం ఈ ప్రభుత్వ ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని,సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ లు ఇప్పటికైనా స్పందించి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ,నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని కోరారు. పలు మండలాల్లో గ్రామాల్లో ఇప్పటివరకు అకాల వర్షాలు కురువకపోవడం కొంతమేరకు రైతులు సంతోషంలో ఉన్న, మళ్లీ ఏ సమయంలోనైనా ఈ అకాల వర్షంతో నష్టం వస్తుందోనని రైతులు భయాందోళనలో ఉన్నారు.

First published:

Tags: Heavy Rains, Local News, Rajanna sircilla, Telangana

ఉత్తమ కథలు