Home /News /telangana /

RAJANNA SIRCILLA RAJANNA SIRCIALLA TASK FORCE POLICE CAUGHT ILLEGALLY TRANSPORTING PDS RICE TWO ARRESTED ABH BRV RKH

Rajanna Sircilla: వెతికే కొద్దీ బయటపడుతున్న అక్రమ పీడీఎస్ రైస్: ఒకే రోజు 155 క్వింటాలు స్వాధీనం

అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేస్తున్న పోలీసులు 

అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేస్తున్న పోలీసులు 

విజిలెన్సు అధికారులు, పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటున్నా...వారి తీరు మారడం లేదు. రెండు వాహనాల్లో అక్రమంగా  తరలిస్తున్న పిడిఎస్ రైస్‌ను బుధవారం రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    K.Haribabu, News 18, Rajanna sircilla

    Rajanna sircilla; రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీడీఎస్ రైస్ అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. విజిలెన్సు అధికారులు, పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటున్నా, వారి తీరు మారడం లేదు. ఐచెర్ వ్యాన్, అశోక్ లెలండ్ మినివ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్‌ను బుధవారం రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా..155 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ సీజ్ చేయడంతో పాటు నిందితులు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే...కొందరు కేటుగాళ్లు రేషన్ బియ్యం(Ration rice)  పక్కదారి పట్టిస్తున్నారన్న పక్కా సమాచారంతో... జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచనల మేరకు, డిఎస్పీ రవి కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం కొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో ముస్తాబాద్ మండలం నామాపూర్ నుండి కామారెడ్డికి వెళ్తున్న ఐచెర్ వ్యాన్, కరీంనగర్(Karimnagar) నుండి కామారెడ్డికి(kamareddy) వెళ్తున్న అశోక్ లేలాండ్ మినీ వ్యాన్‌లను పోలీసులు అడ్డుకున్నారు.

    Read this also; Peddapalli: ఐడియా అదిరింది గురు: బుల్లెట్ బండిపై  బార్బెక్యూ సెటప్ 

    రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పట్టుకున్న పోలీసులు అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రెండు వాహనాల్లో కలిపి 155 క్వింటాళ్ల (155 Quintals) రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈఘటనకు సంబంధించి ముస్తాబాద్ మండలం నామాఫూర్ కు చెందిన కడమంచి స్వామి, భువనగిరి జిల్లా(bhongiri) మల్కాపుర్‌కు చెందిన గుగులోత్ శ్రీకాంత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ ఎస్సై యం.మారుతి,హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, రాజేష్, షబ్బీర్, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ చట్ట వ్యతిరేకమైన పనులు ఎక్కడ జరిగిన ప్రజలు విధిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

    చట్ట వ్యతిరేకమైన పనులు ఎవరు చేసిన ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇటీవల కాలంలో వేములవాడ రూరల్ ప్రాంతంతో పాటు ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సైతం ప్రభుత్వ రేషన్ బియ్యం, నిల్వ ఉంచిన, అక్రమ రవాణా చేస్తున్న ప్రజా పంపిణీ బియ్యాన్ని భారీగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు