హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Sircilla: మాంసం అనేది రాక్షసుల ఆహారం.. మానవుల ఆహారం కాదు

Rajanna Sircilla: మాంసం అనేది రాక్షసుల ఆహారం.. మానవుల ఆహారం కాదు

రాజన్న

రాజన్న సిరిసిల్ల జిల్లా

'పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ' ఆధ్వర్యంలో 20 రోజుల పాటు మహాకారుణ ధ్యాన శాఖాహార ప్రచార యాత్రను నిర్వహిస్తున్నారు. గురువారం వేములవాడ పట్టణానికి చేరుకున్న ఈ బృందం పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ ప్రాంతాల్లో తిరుగుతూ శాఖాహారం పట్ల అవగాహన కల్పించారు

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (K. Haribabu, News18, Rajanna Sircilla)

  ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా 'పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ' ఆధ్వర్యంలో 20 రోజుల పాటు మహాకారుణ ధ్యాన శాఖాహార ప్రచార యాత్ర (Mahakaruna Dhyana Vegetarian Campaign)ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వేములవాడ (Vemulawada) పట్టణానికి చేరుకున్న ఈ బృందం పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ ప్రాంతాల్లో తిరుగుతూ శాఖాహారం పట్ల అవగాహన కల్పించారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ సభ్యుడు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనిల్ కుమార్ చింతా (Anil Kumar) మాట్లాడుతూ.. మాంసాహారం సర్వరోగలకు కారణమని అన్నారు. మాంసం అనేది రాక్షసుల ఆహారమని, మానవుల ఆహారం (Food) కాదని వివరించారు. శాకాహారం తినడం ద్వారానే మనిషి ఆరోగ్యంగా (Healthy) ఉంటాడని అన్నారు. చరిత్రకెక్కిన గొప్ప మేధావులు, మహనీయులు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (BR Ambedkar), సీవీ రామన్, డాక్టర్ అబ్దుల్ కలాం, కబీర్, మహాత్మా గాంధీ వంటి వారు శాఖాహారం భుజించి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించిన మహనీయులేనని, సమస్తమానవాళికి వారు స్ఫూర్తిదాయకమని అన్నారు.

  పత్రీజీ స్వామి 35 సంవత్సరాలుగా దేశ విదేశాల్లో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు (Pyramid meditation centers) నిర్వహిస్తూ లక్షలాది మందిని పిరమిడ్ మాస్టర్లుగా, కోట్ల మందిని ధ్యానులుగా, శాఖాహారులుగా తయారు చేశారు. వారి భోదనల వలన కలిగిన జ్ఞానంతో వారి ఆశయ సాధనలో భాగంగా ప్రజలందరూ ఆరోగ్యంగా మనశ్శాంతితో ఆనందంగా ఆధ్యాత్మికంగా జీవించాలని, సృష్టిలో ప్రతి జీవి ప్రాణం సమానమేనని \"మహాకరణ ధ్యాన శాకాహార ప్రచార యాత్ర"ను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాలు పట్టణాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు.

  "గొర్రె ప్రాణం విలువ మానవుని ప్రాణం కన్నా తక్కువ ఏమి కాదు. మనిషి తన శరీరాన్ని పెంచి పోషించుకోవడానికి గొర్రెలను చంపడం ఎప్పటికీ అంగీకరించలేను. గొర్రెలను ఇలాంటి క్రూరమైన హింస నుంచి రక్షించాలంటే నాకు ఇంకా ఆత్మశుద్ధి త్యాగం అవసరం, ఇలాంటి శుద్ధి త్యాగం గురించి ఘోషిస్తూ ఘోషిస్తూనే ఈ దేహం విడిచి పెట్టవలసి వస్తుందేమో అనిపిస్తుంది.

  ఏ మహాశక్తిని సృష్టించాడో తెలియదు..

  మానవులను ఈ మహా పాతకం నుంచి రక్షించడానికి నిర్దోషులైన ఈ జీవులను కాపాడడానికి ఈ భూమాత ఆలయాన్ని పవిత్రం చేయడానికి ఆ పరమేశ్వరుడు ఏ మహా పురుషుడిని లేదా ఏ మహాశక్తిని సృష్టించాడో తెలియదు గానీ అలా సృష్టించమని దేవున్ని నేను సదా ప్రార్థిస్తున్నాను" అంటూ మహాత్మా గాంధీజీ అన్న సూక్తులు వివరిస్తూ అహింస పరమోధర్మః - ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అనే సూక్తులు వివరిస్తూ వీరు ఈ ప్రచార యాత్ర నిర్వహిస్తున్నారు.

  Great Artist: జీవకళ ఉట్టిపడే విగ్రహాలు: భద్రాద్రి యువకుడి ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే 

  భారత దేశం అహింసాయుత దేశం: భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి అహింసాయుత దేశం. జంతువుల అన్నదే మానవాళి యొక్క మహా పాపకర్మ, జంతు మాంసభక్షణ అనేది సకల రోగాలకు మూల కారణం. పులి మేకను తింటుంది కనుక దానిని క్రూర మృగం అంటాం. ఆవు గడ్డి తింటుంది అందుకే దానిని సాధు జంతువు అంటాం. అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ ఉన్నతమైనది. అహింస ద్వారా మాత్రమే ఈ ప్రపంచం శాంతి మయంగా ఉంటుందని లక్షల సంవత్సరాలుగా భారతీయులు అనుసరిస్తున్న విధానం ఇది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Food, Karimnagar, Local News, Sircilla, Vegetables, Vemulawada

  ఉత్తమ కథలు