Home /News /telangana /

RAJANNA SIRCILLA PROTESTING BJP LEADERS ARRESTED IN VEMULAWADA LEADERS FIRE ON LEADING TRS PARTY BRV ABH RKH

Rajanna Sircilla: ముంపు బాధితులను ఆదుకోమన్నందుకు మాపై కేసులా?.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతల ఆగ్రహం

నిరసన చేస్తున్న ముంపు బాధితులతో మాట్లాడుతున్న డిఎస్పి నాగేంద్ర, సీఐ వెంకటేష్

నిరసన చేస్తున్న ముంపు బాధితులతో మాట్లాడుతున్న డిఎస్పి నాగేంద్ర, సీఐ వెంకటేష్

సంకపల్లి ముంపు బాధితులకు అండగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలపై అధికారపార్టీ అక్రమ కేసులు పెట్టిందంటూ పట్టణ బీజేపీ అధ్యక్షుడు, కౌన్సిలర్ సంతోష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    K.Haribabu, News 18, Rajanna sircilla

    Rajanna sircilla; మిడ్ మానేరు(maneru) ముంపు బాధితుల సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం కరీంనగర్(karimnagar) - వేములవాడ(vemulawada) రహదారిపై నిర్వహించిన నిరసన కార్యక్రమం రసాబాసకు దారితీసింది. సంకపల్లి ముంపు బాధితులకు అండగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలపై అధికారపార్టీ అక్రమ కేసులు పెట్టిందంటూ పట్టణ బీజేపీ అధ్యక్షుడు, కౌన్సిలర్ సంతోష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనడానికి, ఈ దుర్చర్యలే నిదర్శనం అంటు మండిపడ్డారు. నిరసనలో(strike) పాల్గొన్న బీజేపీ నేతలపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక అధికార పార్టీ ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తుందని సంతోష్ బాబు ఆరోపించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

    అయితే ఈ వ్యవహారంపై వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ స్పందిస్తూ సంకెపల్లి గ్రామంలో వేములవాడ - కరీంనగర్ రహదారిపైన బైఠాయించి ధర్నా చేసి, రహదారిపై వెళ్లే ప్రయాణికులను, వాహనదారులను ఇబ్బందికి గురిచేస్తున్న వ్యక్తులపై మాత్రమే కేసు నమోదు చేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బూర శేకర్, జింక అనిల్, నాగుల సురేష్, పూర్ణ చందర్ ఇతరులపైన కేసు నమోదు చేసినట్లు వెంకటేష్ తెలిపారు.

    రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ కార్యదర్శి శేకర్, రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు జింక అనిల్ న్యూస్18తో మాట్లాడుతూ... ప్రజల న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసం, ముంపు బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నష్టపరిహారాన్ని వెంటనే నెరవేర్చాలని, ప్రజలపక్షమై నిరసన తెలిపితే అధికార టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బిజెపి నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ బండి సంజయ్ యాత్రలో కూడా తెరాస గుండాలు బీజేపీ నాయకులపై దాడి చేయడం, వేములవాడలో బీజేపీ నేతలపై మునుపెన్నడూ లేని విధంగా కేసులు నమోదు చేయడం. తెరాస పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని భయాందోళన గురవుతుందని సంకేతాలు చెప్పకనే చెప్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పోరాటాలు కేసులు కొత్తేం కాదని అన్నారు.

    Read this also; Rajanna Sircilla: ఇల్లంతా దోచేసిన దొంగలు.. కానీ వాటిని మాత్రం టచ్ చేయలేదు.. ఆ మాత్రం భయం ఉండాల్సిందే..!

    తమకు పరిహారం చెల్లించాలంటూ మిడ్ మానేరు ముంపు బాధితులు నిరసన తెలిపిన ప్రతిసారి... అధికారులు వచ్చి హామీ ఇవ్వడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో బాధితులు మళ్ళీ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపడం నిత్యకృత్యంగా మారిందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న బీజేపీ నాయకులపై కేసులు నమోదు కావడం అన్యాయమని వారు అన్నారు. కేవలం సంకపల్లి భూ నిర్వాసితులకు నష్టపరిహారం కోరుతు బీజేపీ పార్టీ తరుపున నిరసనలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి కేటీఆర్, సంబంధిత అధికారులు స్పందించి సంకపల్లి ముంపు బాధితులకు నష్టపరిహారం అందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు