హోమ్ /వార్తలు /తెలంగాణ /

Helping for women: మహిళలకు ప్రతిమా ఫౌండేషన్​ చేయూత.. ఉచితంగా కుట్టుమిషన్లు

Helping for women: మహిళలకు ప్రతిమా ఫౌండేషన్​ చేయూత.. ఉచితంగా కుట్టుమిషన్లు

ప్రతిమా

ప్రతిమా ఫౌండేషన్​

మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతిమ ఫౌండేషన్ పని చేస్తోంది. వారిని అభివృద్ధి బాటలో నడపడానికి వారికి ఉచితంగా కుట్టుమిషన్లు అందిస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  (K. Haribabu,News18, Rajanna siricilla)

  మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతిమ ఫౌండేషన్ (Prathima Foundation) పని చేస్తుందని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemula wada) నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండల కేంద్రంలో సెప్టెంబర్ 19న నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా 50 మంది ఒంటరి మహిళలకు,పేద, మధ్యతరగతి మహిళలకు కుట్టు మిషన్ల (Sewing machines) పంపిణీ చేశారు. లబ్ది పొందిన మహిళలు వారి సమస్యలను, స్థితిగతులను, ఆర్థిక ఇబ్బందులను ప్రతిమ ఫౌండేషన్ ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం స్థానిక గౌడ సంఘం, గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో చెన్నమనేని వికాస్ రావును శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

  ఈసందర్భంగా డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు మాట్లాడుతూ.. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతిమ ఫౌండేషన్ పని చేస్తుందని అన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ప్లాంట్స్, అంబులెన్స్, కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కులవృత్తులు చేసుకుంటున్న నిరుపేదల కుటుంబాల అభివృద్ధికి సైతం సహాయం చేస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు ఉచితంగా అంబులెన్స్,హెల్త్ క్యాంప్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్ అందించినట్లు తెలిపారు. నిరుపేదల కష్టాలను తొలగించేందుకు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

  ఇటీవల కాలంలో ఎక్కువ శాతం వ్యాధులు కలుషిత ఆహారం, నీటిని తీసుకోవడం ద్వారానే వస్తున్నాయని, ప్రతి ఒక్కరు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. అందరికి శుద్ధమైన త్రాగు నీరు అందుబాటులో ఉండేలా ఉచిత వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేములవాడ పట్టణంతో పాటు రూరల్ ప్రాంతాల్లోని నిరుపేద మహిళలకు 150 - 200వరకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి అండగా నిలిచారు. రుద్రంగి సర్పంచ్ ప్రభలత మాట్లాడుతూ.. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామని ఈ ఏడాది కూడా ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధుల నివారణకు కృషి చేయాలని కోరారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Sircilla, Vemulawada

  ఉత్తమ కథలు