Home /News /telangana /

RAJANNA SIRCILLA POLICE RAIDED ON TWO HOMES AND FOUND HUGE RATION RICE ABH BRV RKH

Rajanna Sircilla: అక్రమ రేషన్ బియ్యాన్ని ఎక్కడ దాచి పెట్టారో చూడండి!.. 

అక్రమ రేషన్ బియ్యాన్ని ఎక్కడ దాచి పెట్టారో చూడండి 

అక్రమ రేషన్ బియ్యాన్ని ఎక్కడ దాచి పెట్టారో చూడండి 

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన ఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అధికారులు, పోలీసుల కళ్లుగప్పి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పాఠశాలను సీజ్ చేసిన ఎంఈఓ

ఇంకా చదవండి ...
    (K.Hari babu, News 18, Rajanna Sircilla)

    ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన ఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన మరాఠా శంకర్ (60) రెండేళ్ల క్రితం ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. గురువారం ఉదయం అస్వస్థకు గురైన శంకర్ ను కుటుంబ సభ్యులు సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకురాగా... వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి అడ్మిట్ చేసుకున్నారు. అన్ని రిపోర్టులు బాగానే ఉన్నాయని, ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ ఉందని సీటీస్కాన్లో తేలడంతో ఆస్పత్రిలోనే అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు సూచించారు. ఇంతలోనే సాయంత్రం 5 గంటల సమయంలో శంకర్ నోటి నుంచి నురగలు కక్కుతూ.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శంకర్ మృతి చెందాడంటూ బాధిత బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కల్పించుకుని వారించే క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జీ జరుపగా వంశీ అనే యువకుడికి గాయాలయ్యాయి. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు శంకర్ మృతదేహాన్ని జిల్లాస్పత్రికి తరలించారు పోలీసులు. కాగా ఇంటి పెద్ద మరణంతో బాధతో ఉన్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే..కాకుండా మహిళలని కూడా చూడకుండా లాఠీచార్జి చేశారని మృతుడి బంధువులు ఆరోపించారు. బాధితులపై పోలీసులు దాడి చేయలేదని, వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ ఉపేందర్ పేర్కొన్నారు.

    అధికారులు, పోలీసుల కళ్లుగప్పి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముస్తాబాద్ మండలంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈక్రమంలో నామాపూర్లోని రెండు ఇండ్లలో దాచి, నిల్వ ఉంచిన 36.80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో నామాపూర్‌కు చెందిన కడమంచి భద్రయ్య, కడమంచి స్వామిలను అదుపులోకి తీసుకుని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లుకు అప్ప గించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్సై తెలిపారు. అయితే రేషన్ బియ్యాన్ని అక్రమంగా దాచి పెట్టేందుకే నిందితులు రెండు ఇళ్లను ఉపయోగించడంపై అధికారులు సైతం అవాక్కయ్యారు.

    పాఠశాలను సీజ్ చేసిన ఎంఈఓ :
    వేములవాడ అర్బన్ మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో మండల విద్యాధికారి దాడులు నిర్వహించారు. పలువురు వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో వేములవాడ ఎంఈవో భూక్య బన్నాజీ గురువారం పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీ చేశారు. పాఠశాల పేరుకు ముందు ఈ టెక్నో, డీజీ వంటి పేర్లను జోడించరాదని సూచించారు. భవానినగర్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బాల్వాడి పాఠశాలను అధికారులు సీజ్ చేశారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Sircilla, Telangana

    తదుపరి వార్తలు