Home /News /telangana /

RAJANNA SIRCILLA POLICE HARASSING LOCALS AND OPPOSITION LEADERS WHEN MINISTER KTR SIRICILLA VISITS THE DISTRICT SNR KNR

Siricilla | ktr : మంత్రి కేటీఆర్‌ వస్తున్నారంటే .. వాళ్లు పోలీస్ స్టేషన్‌లో ఉండాల్సిందే ..ఇదెక్కడి విడ్డూరం

(మంత్రి టూర్‌ ఉంటే మాకేంటి)

(మంత్రి టూర్‌ ఉంటే మాకేంటి)

Siricilla: సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్‌ వస్తున్నారంటే చాలు వాళ్లకు పెద్ద తలనొప్పిగా మారింది. బందోబస్తు పేరుతో పోలీసులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ప్రతిపక్ష పార్టీ నాయకుల నుంచి మొదల్కొని రైతుల వరకు ముందస్తు అరెస్ట్‌లు చేసి స్టేషన్‌లో కూర్చోబెట్టడం ఆనవాయితిగా మార్చేశారు పోలీసులు. ఏ తప్పు చేయకుండా మాకేంటి ఈ ఖర్మ అంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తెచ్చారు.

ఇంకా చదవండి ...
  (P.Srinivas,New18,Karimnagar)
  సిరిసిల్ల (siricilla)జిల్లాలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌(KTR)పర్యటన ఉందంటే చాలు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, రైతులు, స్థానికులకు జిల్లా పోలీసులు (Police)చుక్కలు చూపిస్తున్నారు. ఉద్యమ ప్రస్థానం నుండి ఎదురులేని నాయకుడిగా నిలిచిన కేటీఆర్ పార్టీలో నెంబర్‌-2 పొజిషన్‌లో ఉన్నారు. అయినప్పటికి ఆయన నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది . సొంత ప్రాంతాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టిస్తున్న నాయకుడు నియోజకవర్గంలో అడుగుపెడితే ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌ (Police Station‌)కు తీసుకెళ్లి కూర్చోబెట్టడం పోలీసులకు ఆనవాయితీగా మారింది.

  మంత్రి పర్యటన పేర చెబితే..
  మంత్రి కేటీఆర్‌ సీఎం తనయుడిగానే కాకుండా 2009 నుంచి వరుసగా సిరిసిల్ల నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికి ఎన్నికల్లో తిరుగులేని నాయకుడిగా నిరూపించుకున్నప్పటికి ఎక్కడో చిన్న అనుమానం కారణంగా మంత్రి పర్యటనలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు తావులేకుండా చూడలని పోలీసులు బందోబస్తు పేరుతో కాస్త హడావుడి చేస్తున్నారు. దీంతో మంత్రిగారు వస్తున్నారంటే తమను అరెస్ట్ చేయడం పక్కా అని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఫిక్సైపోతున్నారంట. మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్‌ తరచూ సిరిసిల్ల నియోజకవర్గానికి రావడం ఎంత కామనో...ఆ సమయంలో నియోజకవర్గంలోని బీజేపీ , కాంగ్రెస్‌తో పాటు మిగిలిన పార్టీల నేతలు, రైతులను ముందస్తు అరెస్ట్‌లు చేయడం అంతే సర్వసాధారణమైపోయింది.  ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్ట్‌లు..
  చివరికి పరిస్థితి ఎలా మారిందంటే మంత్రి కేటీఆర్ టూర్ షెడ్యూల్ వచ్చిందంటే చాలు సిరిసిల్ల పోలీసులు ముందస్తు అరెస్టులకు ప్రత్యేక ప్రణాళికలు వేసుకోవాల్సి వస్తోంది. ప్రత్యేకంగా వాహనాలను పంపి ఆయా పార్టీల నాయకులను సంబంధిత ఠాణాలకు తరలిస్తున్నారు. అలాగే మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుండి బయలుదేరే సరికే దాదాపు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రతిపక్ష పార్టీల క్యాడర్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఆయన పర్యటన ముగించుకొని వెళ్లే వరకు స్టేషన్‌లోనే ఉంచుతున్నారు. అందుకే కేటీఆర్‌ నియోజకవర్గ పర్యటన ఉందంటే వేర్వేరు పార్టీల నాయకులు తమ వ్యక్తిగత పనులను కూడా వాయిదా వేసుకునే విధంగా పోలీసులు సీన్ క్రియేట్ చేశారు.

  ఇది చదవండి: తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనే ఏపీకి న్యాయం.. ఆంధ్రాలోనూ బీఆర్ఎస్ పోటీ..!  ఇదెక్కడి ఆనవాయితీ ..
  కేటీఆర్ టూర్ షెడ్యూల్ ఉన్న ప్రాంతల్లో ఆయనకు బందోబస్తు నిర్వహించేందుకు కొంతమంది పోలీసులు విధులు నిర్వర్తిస్తూ డబుల్ స్కెచ్ వేస్తున్నారు . అనుకోని అతిథులు సిరిసిల్లలో ప్రతిపక్ష పార్టీల నాయకులు అక్కడి పోలీసులకు అనుకోని అతిథులుగా మారిపోయారు . కేటీఆర్ టూర్ ఉన్న రోజున వేకువ జామున ఠాణాలకు వెల్లే ఆయా పార్టీల నాయకులు రాత్రి వరకూ అక్కడే ఉంటుండడంతో వారికి భోజన వసతులు కల్పించాల్సి కూడా వస్తోంది . రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు. రైతులు నిరసనలు తెలిపే అవకాశాలు ఉంటాయనే ముందస్తు అరెస్టుల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పవచ్చు . రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ఆయా పార్టీల నాయకులు ఆందోళనలు వ్యక్తం చేయకుండా ఉండేందుకే కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది .తాజాగా తమను అకారణంగా ముందస్తు అరెస్ట్ చేస్తున్నారంటూ నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగళ్లపల్లి మండలం బద్దనపల్లిలో టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

  ఇది చదవండి : జాతకాలు చెప్పుకునే వాడిని అమ్మాయి పేరు అడ్డుపెట్టుకొని చంపారు .. హత్య వెనుక పెద్ద కథే ఉందా


  Published by:Siva Nanduri
  First published:

  Tags: Minister ktr, Siricilla

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు