హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna siricilla: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు పోలీసుల సేవలు .. ఎంత మంచి పని చేస్తున్నారో తెలుసా

Rajanna siricilla: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు పోలీసుల సేవలు .. ఎంత మంచి పని చేస్తున్నారో తెలుసా

X
Police

Police Services

Rajanna siricilla: తిరుపతి వెంకన్న సన్నిధిలో భక్తులకు ఉచిత అన్నదానం చేస్తారు ఈవిషయం అందరికి తెలుసు. కాని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం పోలీసులే స్వయంగా పాలు పంపిణి చేస్తున్నారు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vemulawada R, India

(K.Haribabu,News18, Rajanna siricilla)

దక్షిణకాశీగా ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ(Vemulawada)శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలో వేములవాడ DSP నాగేంద్ర చారి(Nagendrachary) భక్తులకు ప్రతి సోమవారం పాల(Milk)ను వితరణగా అందజేస్తున్నాడు.. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో మాత్రమే భక్తులకు ఉచితంగా పాలతోపాటు భోజన సౌకర్యం ఉంటుంది. వేములవాడ పోలీసులు స్వయంగా పాలు భక్తులకు పంపిణీ చేస్తూ...స్ఫూర్తిగా నిలుస్తున్నారు.భక్తులు వేములవాడ DSP నాగేంద్ర చారి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని హర్షిస్తున్నారు.భక్తులు,అధికారులు సైతం పోలీసు(Police)ల తీరుపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.

Warangal: ఆటోని లాగడానికి వీళ్లు ఎందుకిత కష్టపడుతున్నారో చూడండి.. దీని వెనుక వేరే స్టోరీ ఉంది..

పోలీసుల పాలదానం ..

వేములవాడ పోలీసులు శాంతి భద్రతలే కాకుండా స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేయడంఅభినందనీయంగా ఉన్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.. మునుగోడు మొక్కును చెల్లించేందుకు వేములవాడ రాజన్న దర్శనానికి పార్టీ శ్రేణులతో కలిసి వచ్చిన సందర్భంగా...వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనానికి వస్తున్న భక్తులకు వేడి పాలను వేములవాడ పోలీసులు భక్తులకు అందిస్తున్న తీరును చూసి వేములవాడ DSP నాగేంద్ర చారిని పట్టణ సీఐ వెంకటేశ్ను అభినందించారు.

రాజన్న క్షేత్రంలో భక్తులకు సేవ..

తెలంగాణ రాష్ట్రం వచ్చాక శాంతి భద్రతలు శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణలో పోలీస్ యంత్రాంగం స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు.శాంతి భద్రతలు కాపాడడమే కాకుండా శాంతిగా ఉన్నటువంటి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వేములవాడ పోలీసులు నిదర్శనమని అన్నారు.పోలీస్ నోటిఫికేషన్ లో యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ యంత్రాంగం ముందుకు రావడంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని అభినందిస్తున్నామన్నారు.

ఆదర్శంగా మారిన పోలీసులు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు యంత్రాంగం మరింత పటిష్టంగా మారిందని, ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ప్రజలకు పోలీసు యంత్రాంగం మరింత దగ్గర అయిందని అన్నారు. అప్పట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మావోయిస్టుల కోసమే పోలీసులు ఉండేవారని,ఇప్పుడు అంటే... మనం స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత.. పోలీసు వ్యవస్థ అనే కాదు వివిధ శాఖల్లో ప్రజాప్రతినిధులు అధికారులు సైతం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

Sabarimala | Kerala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్ .. ఇకపై శబరిమలకు వాటిని సంచిలో తీసుకెళ్లవచ్చు ..

కాప్స్‌పై ప్రశంసల వెల్లువ..

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. వేములవాడ పోలీసులను అభినందించారు వినోద్ కుమార్.. డి.ఎస్.పి నాగేంద్ర చారి భక్తులకు ఉచితంగా ప్రతి సోమవారం పాలు పంపిణీ చేయడం.. ఆలయ అధికారులు ప్రతిరోజు భక్తులకు ఉచితంగా పాలు, భోజనం ఏర్పాటుచేసి భక్తులకు అండగా నిలవాలని రాజన్న భక్తులు దేవాదాయశాఖ అధికారులను కోరుతున్నారు.

First published:

Tags: Local News, Siricilla, Telangana News

ఉత్తమ కథలు