Home /News /telangana /

RAJANNA SIRCILLA PEOPLES TURN YELLOW WHEN THEY WALK UP THE RASI HILL IN RAJANNA SIRICILLA DISTRICT TO GO TO HANUMAN TEMPLE FULL DETAILS HERE RKH NJ PRV

Mystery Hills: ఆ గుట్ట ఎక్కిన వాళ్లంతా పసుపు రంగులో మారుతున్నారు..! ఇంతకీ ఆ గుట్ట ఎక్కడుంది..దాని ప్రత్యేకతలేంటి..?

రాసి గుట్ట, హనుమాన్​ విగ్రహం

రాసి గుట్ట, హనుమాన్​ విగ్రహం

సైన్స్‌ (Science)కు సైతం అంతుచిక్కని రహస్యాలు (Mysteries) ఆ గుట్టపై ఉన్నాయి. ఆ గుట్టపైకి వెళ్లిన వాళ్లంతా కలర్‌ మారిపోతున్నారు..! ఇంతకీ ఆ గుట్ట ఎక్కడుంది..దాని ప్రత్యేకతలేంటి..?

    (k. Hari babu, Rajanna siricilla)

    సైన్స్‌ (Science)కు సైతం అంతుచిక్కని రహస్యాలు (Mysteries) ఆ గుట్ట (Hillపై ఉన్నాయి. ఆ గుట్టపైకి వెళ్లిన వాళ్లంతా కలర్‌ మారిపోతున్నారు..! ఇంతకీ ఆ గుట్ట ఎక్కడుంది..దాని ప్రత్యేకతలేంటి..? వివరాళ్లోకి వెళ్లితే…. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna siricilla) వీర్నపల్లి మండల కేంద్రంలోని గుంటపల్లి చెరువు సమీపాన మూడు కిలోమీటర్ల దూరంలో రాసిగుట్ట (Rasi hill) ఉంది. ఇక్కడ మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి ఆలయం (Anjaneya Swamy Temple) ఉంది. శ్రీ ఆంజనేయ స్వామి వారిని దాసాంజనేయ స్వామి అని పిలుస్తారు. ఈ రాశి గుట్టపైకి స్వామివారిని దర్శించుకోవాలంటే మూడు కిలోమీటర్ల మేరకు ఉన్న రాసి గుట్ట (Rasi Gutta)ను సాహసోపేతంగా ఎక్కి స్వామివారిని దర్శించుకుంటే వ్యక్తి శరీరం (కాళ్ళు, చేతులు) పసుపు రంగులోకి (Turns yellow color) మారిపోతాయని స్థానిక ప్రజలతో పాటు దర్శించుకున్న భక్తులు చెబుతున్నారు.

    సైన్స్‌కు సైతం అంతుచిక్కని రహస్యాలు (Secrets) రాసి గుట్టపై ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. రాసి గుట్టపై ఉండే రాళ్లు (Stones) తేలికపాటిగా ఉండి చిన్నపిల్లలు రాసుకోవడానికి, తినడానికి వాటిని ఉపయోగించడం విశేషం. వాటిని రాశి గుట్ట బలపాలు అంటారు. కాలితో తాకితే గరుకుగాను గట్టిగానూ రాయి వలే ఉంటాయి. కానీ నోటిలో వేసుకుంటే మాత్రం మెత్తగా తీయని రుచి వస్తుంది.

    శ్రావణమాసం హనుమాన్ జయంతి (hanuman Jayanti) సమయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చుట్టూ గుట్టల సమూహం…..మధ్యలో రాశి గుట్ట ఉంటుంది. పచ్చని అటవీ ప్రాంతం ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఈ మూడు కిలోమీటర్ల మేర ఎలాంటి వాహనాలు కానీ రావడానికి సౌకర్యం లేదు. దీంతో దాదాపు మూడు కిలోమీటర్లు కాలినడకనే (By walk) వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు భక్తులు.

    రాజన్న సిరిసిల్ల జిల్లాకు 39 కిలోమీటర్ల దూరంలో ఈ రాసి గుట్ట ఉంది.  గుట్టపై ఉన్న హనుమంతుడు చాలా శక్తివంతమైన దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. అతి పురాతనమైన ఆలయం. స్వామివారిని దర్శించుకొని కోరికలు కోరుకుంటే తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చుట్టూ గుట్టల నడుమ మధ్యలో గుట్టపై ఆంజనేయ స్వామి దివ్య క్షేత్రం అలరారుతోంది.

    జానపద కథల ప్రకారం..

    హనుమంతుడు సంజీవని పర్వతం (Sanjeevani Hills) మోసుకెళ్తున్న క్రమంలో ఓ చిన్న ముక్క జారిపడి కొండగట్టుగా వెలిసిందని.. అదే క్రమంలో ఈ ప్రాంతంలో కూడా ఓ చిన్న ముక్క పడి రాసి గుట్టగా వెలిసిందని ఈ ప్రాంత వాసుల ప్రతీతి. ఈ గుట్టపై రాళ్లు జాదు రంగులో ఉంటాయి. ఎంతో శక్తివంతమైన హనుమంతుని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు (Devotes) వస్తుంటారు. సౌకర్యాలు లేమితో కొద్ది సమస్యగా మారిందని భక్తులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే గొప్ప పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందుతుందని భక్తులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శని, మంగళవారాల్లో సందర్శకులు భక్తుల తాకిడి ఈ ఆలయానికి ఎక్కువ ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే దయామయుడు దాసాంజనేయ స్వామి అని భక్తులు పిలుస్తారు.

    రాసిగుట్ట ఆలయాన్ని చూసుకునే భూక్యా డాక్వా వారి మాటల్లో ఈ ఆలయచరిత్ర…!

    పూర్వం ఈ గుట్టపై నిలువెత్తు బండరాయి (Rock) ఉండేదట.. దానిని దైవ స్వరూపంగా భావించేవారని.. ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలకు నిలువెత్తు బండరాయి కంపించి విరిగిపోయిందట.  దీంతో గ్రామ ప్రజలు సిద్ధాంతుల వద్దకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పగా నిలువెత్తు బండరాయి స్థానంలో హనుమంతుని విగ్రహాన్ని 9hanuman Statue) ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని చెప్పారట.

    ఈ పరిసర ప్రాంతాల్లో ఎంత వేసవి అయినా నీరు పుష్కలంగా ఉంటుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. రాసి గుట్ట సమీపంలో సిద్ధులు, ఋషులు తపస్సు చేసుకునే వారని, వారు నీటి గుండాన్ని, బావిని ఏర్పాటు చేశారని, సంవత్సరాలు గడచిరా అందులో నీరు మాత్రం ఇంకిపోదని… అది దైవ స్వరూపం అని భక్తులు అంటున్నారు.

    రాతిగుట్టపై అంతుచిక్కని రహస్యం..!

    ఇక్కడ వర్షాకాలంలో అద్భుతమైన జలం పాత దర్శనమిస్తోంది. దట్టమైన  అడవిలో ఈ ఆలయం ఉండడం విశేషం. ఆధ్యాత్మికం,పర్యాటకం, ప్రకృతికి నిలువుటద్దంగా రాశి గుట్ట నిలుస్తోంది. గుట్టపైకి వెళితే పసుపు రంగులోకి మారి పోతారమని…స్వామివారిని దర్శించుకున్న తర్వాత యథాస్థానంలోకి రంగు మారుతాయని….ఇదే ఇక్కడి అంతుచిక్కని రహస్యమంటున్నారు. ఇక్కడి అటవీప్రాంతం ప్రభావమో లేక, గుట్ట పైకి వచ్చే మార్గంలో ఉన్న మట్టితో కూడిన .. స్వభావమో అనేది ఇంకా పరిశోధన జరుగుతోంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hindu Temples, Lord Hanuman, Siricilla

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు