రిపోర్టర్ : హరిబాబు
లొకేషన్ : రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు పెంపుదలకు జిల్లా యంత్రాగం కృషి చేస్తుంది. ఓ వైపు మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులకు అదనంగా జిల్లాలోని పలు విద్యా సంస్థలలోడిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు (DMFT) నిధులు రూ.94 లక్షల 98 వేల రూపాయలతో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే 31 పనులను చేపడుతున్నారు. జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు, నర్సింగ్ కళాశాల, మోడల్ స్కూల్స్, ఏకలవ్య గురుకులాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో గురుకుల పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థంమిషన్ భగీరథ నీటి సరఫరా, కొత్త మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ఇదివరకే ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ లకు మరమ్మతులు, సెప్టిక్ ట్యాంక్ ఔట్లెట్, టాయిలెట్ బ్లాక్ లలో మరమ్మతు పనులు వంటి అత్యవసర, ఆవశ్యకమైన పనులు చేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ మార్గదర్శనం మేరకు చేపడుతున్న ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయడంపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) కార్య నిర్వాహక ఇంజనీరు ఈ పనులను పర్యేక్షిoచనున్నారు. కాగా పనులు చేపట్టేందుకు ఈ నెల 15న జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు మంజూరు చేశారు.
19 కేజీబీవీ, మోడల్ స్కూల్స్ లలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేశారు.
రూ.39 లక్షల 28 వేల రూపాయలతో జిల్లాలోనీ 19 కేజిబీవిలు, మోడల్ స్కూల్ లలో చేపట్టిన 16 పనులు పూర్తి అయ్యాయి. గత సంవత్సరం చివరలో జిల్లాలోని 19 కేజీబివిలు, మోడల్ స్కూల్స్ లలో సోలార్ వాటర్ హీటర్ మరమ్మత్తు పనులు, మినరల్ వాటర్ ప్లాంట్ ల ఏర్పాటు పనులను జిల్లా కలెక్టర్ అనుమతులు మంజూరు చేశారు. రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) ఇంజనీర్ లు ఈ పనులను చేపట్టారు.
ఇప్పటికే అన్ని విద్యా సంస్థలలో ఈ పనులు పూర్తి అయ్యాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని పనులు చెయ్యడంతో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లి దండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లాలోని గురుకుల, కస్తూరిబా పాఠశాలలను తనిఖీ చేస్తూ.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటూ.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అధికారులను ఆదేశిస్తూ.. పలు సూచనలు సైతం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Local News, Peddapalli, Telangana schools