హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna siricilla: పోడు భూముల విధులు మాకొద్దు.. పంచాయతీ కార్యదర్శుల్లో భయం

Rajanna siricilla: పోడు భూముల విధులు మాకొద్దు.. పంచాయతీ కార్యదర్శుల్లో భయం

secretaries

secretaries

భయం భయంగా రోజు విధులకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మూడు రోజుల క్రితం ఖమ్మంలో ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ హత్య మరింత కలవరపెడుతుంది. విధులు నిర్వహిస్తుండగానే గొడ్డలి దాడి చేసి హత్య చేసిన సంఘటనతో పంచాయతీ కార్యదర్శుల్లో ప్రాణ భయం నెలకొంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Sircilla, India

  K.Haribabu,News18, Rajanna siricilla

  ఈ డ్యూటీ మాకొద్దు!?..

  పోడు భూముల విధులు వద్దంటున్న పంచాయతీ కార్యదర్శులు..

  భయం భయంగా విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు-

  ఇప్పటికే గ్రామంలో పనుల తీరిక లేక సతమతం-

  పోడు భూముల ఎంపిక ప్రక్రియలో తమ పాత్రలేదంటున్న కార్యదర్శులు..

  పోడు భూమి కోసం గతంలో కార్యదర్శిపై దాడి జరిగింది.

  అర్హులైనా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కార్యదర్శుల విధులు కత్తిసాములుగా తయారైంది. పోడు భూములు చేస్తున్న వారిని గుర్తించి, వారి పూర్తి నివేధిక ప్రభుత్వానికి పంపించే విధానంలో గ్రామ పంచాయతీ అవరణలో గ్రామ సభలు నిర్వహించి, ఏమైనా అభ్యంతరాలు, సమస్యలుంటే గ్రామ సభలో చర్చిస్తారు. ఇందులో గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామంలో 15 మంది సభ్యులతో కూడిన కమిటీ సమక్షంలో పోడు భూముల అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

  కానీ ఇక్కడ గ్రామ సభలు నిర్వహించే సమయంలో పంచాయతీ కార్యదర్శులపై స్థానికులు నానా దుర్భాషలాడుడు.. చంపుతామని బెదిరింపులకు పాల్పడడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఊరుతండా పంచాయతీ కార్యదర్శి రమేష్ ను అదే గ్రామానికి చెందిన సాగర్ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. ఈ విషయమై కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  భయం భయంగా రోజు విధులకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మూడు రోజుల క్రితం ఖమ్మంలో ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ హత్య మరింత కలవరపెడుతుంది. విధులు నిర్వహిస్తుండగానే గొడ్డలి దాడి చేసి హత్య చేసిన సంఘటనతో పంచాయతీ కార్యదర్శుల్లో ప్రాణ భయం నెలకొంది. దీంతో పోడు భూముల డ్యూటీ నుంచి తమను మినహాయించాలని వేడుకుంటున్నారు.

  కోనరావుపేట మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఊరు తండా, గోవిందరావుపేట, అజ్మీర తండా, వట్టిమల్ల గొల్లపల్లి, భూక్యరెడ్డి తండా, కమ్మరిపేట తండా పోడు భూముల సాగు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ప్రాణభయం ఉందనీ, తమను ఈ డ్యూటీ నుంచి తొలగించాలని జడ్పీ చైర్పర్సన్ అరుణ, ఎంపీపీ చంద్రయ్యల ముందు గోడు వెల్లబోసుకున్నారు.

  ఇప్పటికే గ్రామాలభివృద్ధిలో నిరంతరం బీజీగా ఉంటున్న తమను.. ఈ సంబంధం లేని పోడు భూములకు అర్హులైన వ్యక్తుల ఎంపిక నుంచి మినహాయించాలని కార్యదర్శులు కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సానుకులంగా స్పందించి పరిష్కరించాలని కార్యదర్శులు కోరుతున్నారు.

  పోడు భూముల డ్యూటీ నుంచి మినహాయించాలి : అనిల్ కోనరావుపేట మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు గిరిజన తండాల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పోడు భూముల అర్హులైన లబ్ధిదారుల ఎంపిక నుంచి మినహామించాలని, ఇప్పటికే గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల్లో కార్యదర్శులకు, అదనంగా సంబంధం లేని పొడు భూముల ఎంపిక ప్రక్రియ కోసం ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.

  భయం భయంగా విధులు నిర్వహిస్తున్నాం : రమేష్, ఊరు తండా పంచాయతీ కార్యదర్శి

  పోడు భూముల ఎంపిక ప్రక్రియలో భాగంగా తమకు అదనంగా డ్యూటీ వేయడం సరికాదు. గ్రామ సభలు నిర్వహించిన సమయంలో కొందరు వ్యక్తులు నానా దుర్భాషలు ఆడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు. తనపై దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. రోజు భయం భయంగా డ్యూటీ చేస్తున్నామని, తమ ప్రాణాలకు హాని జరుగకుండా ఉన్నతాధికారులు చొరవ చూపాలని కోరారు. ప్రజలకు నిరంతరం సేవ చేసే తమకు ఇలాంటి విధులు అప్పగించకుండా చూడాలని కోరుతున్నారు.

  First published:

  Tags: Local News

  ఉత్తమ కథలు