హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: మితిమీరిన వేగంతో పత్తి పొలంలోకి దూసుకెళ్లిన కారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Rajanna Siricilla: మితిమీరిన వేగంతో పత్తి పొలంలోకి దూసుకెళ్లిన కారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదం

అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం...రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన రవి శుక్రవారం తన స్నేహితుడి కారు తీసుకొని, మరో స్నేహితుడితో కోరుట్ల వెళ్లాడు

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  (K. Haribabu,News18, Rajanna siricilla)

  అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన రవి శుక్రవారం తన స్నేహితుడి కారు తీసుకొని, మరో స్నేహితుడితో కోరుట్ల వెళ్లాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో వస్తుండగా.. వేములవాడ (Vemulwada) నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలంలోని మూడపల్లి శివారు శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న షిఫ్ట్ కారు అదుపుతప్పి, సమీప పత్తి పొలంలోకి దూసుకెళ్ళింది. అక్కడే ఉన్న కొందరు గమనించి వారిని కారులో నుంచి బయటకు తీసి, బోల్తా పడిన కారును పైకి లేపారు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  గంజాయి (Ganja) సేవిస్తున్న నలుగురిని సిరిసిల్ల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల నుంచి పెద్దబోనాల వెళ్లే రహదారి వెంట రోజా గ్రౌండ్‌లో కొందరు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

  సిరిసిల్ల పట్టణానికి చెందిన సామల బాలకృష్ణ, గంధం కనుకరాజు, గడప గోపికృష్ణ, కోనరావుపేట మండలం కొలనూరుకు చెందిన నందగిరి ఐలేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించినట్లు సీఐ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువకులు... మత్తు ఉచ్చులో పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీఐ విజ్ఞప్తి చేశారు.

  Nagarkurnool: సారా దుకాణాలపై దాడులు: కల్తీ మద్యంపై కొరడాతో దుకాణదారుల్లో గుబులు 

  ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంకు చెందిన కాలువ అనిల్, పాల ప్రశాంత్‌లు గురువారం రాత్రి రుద్రంగి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈక్రమంలో స్థానిక వేంకటేశ్వరస్వామివారి ఆలయ సమీపంలోని అడవిలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈప్రమాదంలో అనిల్, ప్రశాంత్ లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి క్షతగాత్రుల్లో ఒకరిని వేములవాడ, మరొకరిని కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Sircilla, Vemulawada

  ఉత్తమ కథలు